Share News

Adilabad: తుపాకుల సరఫరా కుట్ర గుట్టురట్టు.. సంచలన విషయాలు వెల్లడించిన ఎస్పీ..

ABN , Publish Date - Nov 22 , 2024 | 06:02 PM

జిల్లాలో తుపాకుల సరఫరా ఘటనను పోలీసులు గుట్టురట్టు చేశారు. ప్రతీకార హత్య కుట్రను ఆదిలాబాద్ రూరల్ పోలీసులు భగ్నం చేశారు. మెుత్తం 9మందిపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు.

Adilabad: తుపాకుల సరఫరా కుట్ర గుట్టురట్టు.. సంచలన విషయాలు వెల్లడించిన ఎస్పీ..
Adilabad SP Gaush Alam

ఆదిలాబాద్: జిల్లాలో తుపాకుల సరఫరా ఘటనను పోలీసులు గుట్టురట్టు చేశారు. ప్రతీకార హత్య కుట్రను ఆదిలాబాద్ రూరల్ పోలీసులు భగ్నం చేశారు. మెుత్తం 9మందిపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి నాలుగు తుపాకులు, 8 మ్యాగ్జిన్స్, 18 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ (శుక్రవారం) ఉదయం తుపాకుల సరఫరా జరుగుతోందని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పిప్పర్ వాడా టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గన్స్ తరలిస్తూ ఇద్దరు పట్టుపడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


అయితే ఈ విషయాన్ని గుట్టుగా ఉంచి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు విచారణలో సంచలన విషయాలు వెల్లడించారని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. ఓ వ్యక్తిని హత్య చేసేందుకు వీరంతా కుట్ర పన్నారని ఆయన వెల్లడించారు. హత్య చేసి ప్రతీకారం తీర్చుకోవాలని భావించారని, అందుకే తుపాకులు సేకరించి ఒకరిని హతమార్చేందుకు ప్రణాళికలు రచించారని ఎస్పీ వెల్లడించారు. పక్కా సమాచారంతోనే నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేశామని ఆయన చెప్పుకొచ్చారు. వారిచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని పట్టుకున్నామని తెలిపారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉందని, త్వరలోనే మిగిలిన నిందితులనూ పట్టుకుంటామని ఎస్పీ గౌస్ ఆలం వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

KTR: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్..

Mahesh Kumar: అదానీ లంచం వ్యవహారంలో కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీపీసీసీ చీఫ్..

Updated Date - Nov 22 , 2024 | 06:06 PM