ధాన్యం ఆరబెట్టిన తర్వాతనే తీసుకురావాలి
ABN, Publish Date - Nov 19 , 2024 | 10:08 PM
రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాలని అదనపు కలెక్టర్ మోతీ లాల్ రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ద్వారక రైతువేదికలో రైతులకు అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పొలం కోతకు 15 రోజుల ముందే నీటి తడిని నిలిపివేయా లన్నారు.
దండేపల్లి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాలని అదనపు కలెక్టర్ మోతీ లాల్ రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ద్వారక రైతువేదికలో రైతులకు అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పొలం కోతకు 15 రోజుల ముందే నీటి తడిని నిలిపివేయా లన్నారు. పంట ఎండిన తర్వాతనే కోయాలన్నారు.
మంచు కురిసే సమ యంలో కొస్తే గింజలు మెత్తబడి ధాన్యం నలుపెక్కుతుందన్నారు. హార్వె స్టర్ స్పీడ్ 18 నుంచి 20 ఆర్‌పిఎం ఉండాలన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కల్పన మాట్లాడుతూ ధాన్యం ఆరబెట్టిన తర్వాతనే కొనుగోలు కేం ద్రానికి తీసుకవస్తే ప్రభుత్వ మద్దతు ధర పొందవచ్చున్నారు. డీసీఎస్‌వో బ్రహ్మరావు, డీఎం శ్రీకళ, ఇన్‌చార్జీ ఏడిఏ సురేఖ, తహసీల్దార్ సంధ్యరాణి, మండలవ్యవసాయ శాఖ అధికారి అంజిత్‌కుమార్, ఏఈవోలు పాల్గొన్నారు.
Updated Date - Nov 19 , 2024 | 10:08 PM