Share News

పకడ్బందీగా సర్వే చేపట్టాలి

ABN , Publish Date - Nov 16 , 2024 | 10:25 PM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ శనివారం పరిశీలించారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 3, 9, 15 వార్డుల్లో జరుగుతున్న సర్వేను తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సర్వేలో ప్రతీ అంశాన్ని పూరించాలని సిబ్బందికి సూచించారు.

పకడ్బందీగా సర్వే చేపట్టాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ శనివారం పరిశీలించారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 3, 9, 15 వార్డుల్లో జరుగుతున్న సర్వేను తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సర్వేలో ప్రతీ అంశాన్ని పూరించాలని సిబ్బందికి సూచించారు. ఎన్యుమరేటర్లు అన్ని వివరాలను పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలన్నారు. సర్వే నిర్వహించే ప్రాంతంలో ముందు రోజు సంబంధిత కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వాలని, ఇంటి యజమానులు అవసరమైన పత్రాలతో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మందమర్రిరూరల్‌, (ఆంధ్రజ్యోతి) : అందుగులపేట, పులిమడుగు, బొక్కలగుట్ట గ్రామాల్లో జరుగుతున్న ఇంటింటి కుటుంబ సర్వేను శనివారం ఎంపీడీవో రాజేశ్వర్‌ పరిశీలించారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం నర్సరీలను పరిశీలించారు. మొక్కలను సంరక్షించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 10:25 PM