ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏడాదైనా... పేరుకే మండలం.. వసతులు శూన్యం

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:41 AM

పరిపాలన సౌల భ్యం, ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పా టు చేసింది.

కార్యాలయం ప్రారంభించి తహసీల్దార్‌ను సన్మానిస్తున్న మంత్రి, ఎమ్మెల్యే (ఫైల్‌)

ఏడాదైనా... పేరుకే మండలం.. వసతులు శూన్యం

తహసీల్దార్‌ కార్యాలయం తప్ప మరే ఇతర కార్యాలయాలు లేవు

గుడిపల్లి మండలం ఏర్పడి నేటికి సంవత్సరం పూర్తి

పూర్తిస్థాయిలో కార్యాలయాలు లేక ప్రజలు ఇబ్బందులు

పెద్దఅడిశర్లపల్లి, అక్టోబరు 20: పరిపాలన సౌల భ్యం, ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పా టు చేసింది. అందులో భాగంగానే 2023 అక్టోబరు 4వ తేదీన పెద్ద అడిశర్లపల్లి (పీఏపల్లి) మండలంలోని 11 గ్రామ పంచాయతీలతో మేజర్‌ గ్రామ పంచాయతీ గా ఉన్న గుడిపల్లిని మండలంగా ఏర్పాటు చేసింది. అప్పటి విద్యుతశాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి అక్టోబరు 4, 2023న తహసీల్దార్‌ కార్యాలయాన్ని అద్దె ఇంటిలో ప్రారంభించారు. అప్పటి నుంచి ఏడాది పూర్తయినా నేటికీ మరే ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడలేదు. దీంతో పనులు కావాలంటే పాత మండలం పెద్దఅడిశర్లపల్లి మండలానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంపీడీవో కార్యాలయం, పోలీ్‌సస్టేషన, ఎం ఈవో, వ్యవసాయ, పీఏసీఎస్‌, స్త్రీ శక్తి భవనం వంటి కార్యాలయాల ఊసే లేదు.

గత ప్రభుత్వ కొత్త మండలాలు హడావుడిగా ఏ ర్పాటు చేశారనే అభిప్రాయం అటు అధికారుల్లోనూ, ఇటు ప్రజల్లో వ్యక్తమవుతుంది. మండల కార్యాలయంలో పనుల కోసం ప్రజలు పక్క మండలానికి వెళ్లాల్సిన పరిస్థితి మారడం లేదు. ప్రభు త్వ కార్యాలయాలై న ఎస్‌బీఐ, తపాలా, తహసీల్దార్‌ కార్యాలయాలు అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. ఈ కార్యాలయాల్లో వసతులు లేక ప్రజలు ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాల కోసం స్థలాల చూపించడం లేదు. దీనికి తోడు ప్రభుత్వ కా ర్యాలయాల సముదాయాలను నిర్మించేందుకు అవసరమైన నిధులు కేటాయించడం లేదు. దీంతో కొత్తగా ఏర్పడిన గుడిపల్లి మం డలం ఏర్పడిందని ఆనందపడాలో, కా ర్యాలయాలు లేక ప క్క మండలానికి వెళ్లాల్సి వస్తుందని బాధపడా లో అర్థం కావడం లేదని ప్రజలు వాపోతున్నా రు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం మండలానికి కావాల్సిన వసతులు, కార్యాలయాలు, అధికారుల ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి

మండలం ఏర్పాటై ఏడాది పూర్తయినా ప్రభుత్వ కా ర్యాలయాలు ఏర్పాటు చేయలేదు. ఉన్నవి అద్దె భవనా ల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి గుడిపల్లి మండలానికి అధికారులను కేటాయించి పూ ర్తి స్థాయిలో పాలన కొనసాగేలా ఏర్పాటు చేయాలి.

- సురబోయిన శ్రీనువాసులు, గుడిపల్లి

ప్రభుత్వం నుంచి ఎలాంటి గెడ్‌ౖలైన్స లేవు

గుడిపల్లి మండలం ఏర్పడి అక్టోబరు 4వ తేదీకి ఏడాది పూర్తయింది. ప్రస్తుతం తహసీల్దార్‌ కార్యాలయం, ఎస్‌బీఐ, ప్రభుత్వ దవాఖానా మాత్రమే కొనసాగుతున్నాయి. మిగతా కార్యాలయాలు, అధికారులను కేటాయించడం వంటివి ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్‌లైన్స రాలేదు. వస్తే ఏర్పాటు చేస్తాం.

- శ్రీరాములు, ఆర్డీవో, దేవరకొండ

Updated Date - Oct 21 , 2024 | 12:41 AM