ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: చాలా పకడ్బందీగా కులగణన

ABN, Publish Date - Nov 01 , 2024 | 05:52 PM

తెలంగాణలో కులగణన నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని చర్యలు చేపట్టింది. నవంబర్ 30వ తేదీతో ఇది ముగియనుంది. ఆ క్రమంలో కులగణనపై బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ శుక్రవారం కరీంనగర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఏమైందో ఎవరికీ తెలియదన్నారు. ఆ దేవుడికెరుక అని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు.

TG BC Commission chairman G Niranjan

కరీంనగర్, నవంబర్ 01: రాష్ట్రంలో కులగణనను చాలా పకడ్బందీగా నిర్వహిస్తామని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ స్పష్టం చేశారు. ఈ కులగణన సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చినా.. తప్పుడు సమాచారం నమోదు చేసినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. శుక్రవారం కరీంనగర్‌లో నిరంజన్ మాట్లాడుతూ.. కులగణన ద్వారా అన్ని కులాల సామాజిక ఆర్థిక పరిస్థితిని తెలుసుకుంటామన్నారు.

China: జస్ట్ నాలుగు నెలల్లో రూ.3 కోట్లు.. ఎలా సంపాదించాడంటే..?


కులగణన ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ జరిగేది కాదని ఆయన పేర్కొన్నారు. బీసీ కమిషన్ ముందు స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రజలుకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. అయితే సరైన నివేదిక ఇవ్వకపోతే ఆ కులమే తీవ్రంగా నష్ట పోతుందని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన సూచించారు. అలాగే కులగణన నేపథ్యంలో బీసీ కమిషన్‌కు ఆటంకాలు కలిగించ వద్దని ప్రజలకు తెలిపారు.

Also Read: Video Viral: ఉచిత గ్యాస్ పథకం ప్రారంభించి.. లబ్దిదారుడి ఇంట టీ పెట్టిన సీఎం చంద్రబాబు


ఈ అంశంపై కొందరు భవిష్యత్‌లో కోర్టుకు కూడా వెళ్లే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఎక్కడ తప్పు జరగకుండా.. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా జాగ్రత్త పడుతున్నామన్నారు. అయితే బీసీ కమిషన్ ఏ ఒక్క పార్టీకి చెందినది కాదని ఆయన కుండ బద్దలు కొట్టారు.

Also Read: మెంతి కూర ఆకుతో ఇన్ని లాభాలా..?


ఎవరికీ తాము భయపడమన్నారు. న్యాయస్థానాల పట్ల తమకు గౌరవం ఉందని చెప్పారు. న్యాయస్థానాల ఆదేశాలను తాము తప్పక పాటిస్తామని తెలిపారు. ఈ కులగణనతో బీసీలే కాదు.. ఎవరి లెక్క ఎంతో తెలిసి పోతుందన్నారు. ఇక సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ ఇంకా బీసీ కమిషన్‌కు చేరలేదన్నారు. వివిధ కులాలను వేరే గ్రూపుల్లోకి మార్చాలని పలువురు కోరుతున్నారని.. ఈ అంశంపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు.

Also Read: Bengaluru: కారు ఆపలేదంటూ.. అద్దాలు పగలకొట్టి..


అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలో నాటి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఎక్కడ ఉందో తెలియదని వ్యంగ్యంగా అన్నారు. ఆ వివరాలు ఏమయ్యాయో ఆ దేవుడికే తెలుసునన్నారు. కానీ తాము అలాంటి తప్పు ముమ్మాటికి చేయమని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ స్పష్టం చేశారు.

Also Read: TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం


రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం నవంబర్ 6వ తేదీ నుంచి కులగణన చేపట్టనుంది. ఇది నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. అయితే కులగణనపై పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. నవంబర్ నెలాఖరుకు ఈ కులగణన పూర్తి చేసి.. స్థానిక సంస్థలకు వెళ్దామని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే.

Also Read: November: నవంబర్‌‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..?


అలాగే ఈ కులగణన అనేది ఎక్స్ రే మాత్రమే కాదని.. హెల్త్ చెకప్ లాంటిందని కూడా సీఎం రేవంత్ అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కులగణన చేపడతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో తొలిసారిగా తెలంగాణలో కులగణనను ప్రభుత్వం చేపట్టనుంది.

Also Read: పంజాబీ గాయకుడి నివాసంపై కాల్పులు.. వీడియో విడుదల చేసిన పోలీసులు


కులగణనలో ఏమేం అడుగుతారంటే:

మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయ పదవులు పొందారా?, ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారా?, మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఎలాంటి ఉపాధి పొందుతున్నారు?, భూమి ఉందా?, ఏడాదికి కుటుంబ ఆదాయం ఎంత వస్తుంది? తదితర వివరాలన్నీ సేకరించనున్నారని సమాచారం.

For Telangana News And Telugu News..

Updated Date - Nov 01 , 2024 | 06:04 PM