ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: ప్రైవేట్‌ బడుల్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌ల విక్రయంపై నిషేధం

ABN, Publish Date - Jun 01 , 2024 | 03:12 AM

ప్రైవేట్‌ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్‌లు వంటి వాటి విక్రయాలపై నిషేధం విధిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తాజాగా సర్క్యులర్‌ జారీ చేసింది.

  • ఆదేశాలు జారీ చేసి విద్యా శాఖ

  • సర్క్యులర్‌తో సమస్య తీరదు

  • కఠిన చర్యలు తీసుకోవాలి

  • ప్రభుత్వ పుస్తకాల పబ్లిషర్ల విజ్ఞప్తి

  • ఆదేశాలు జారీ చేసి విద్యా శాఖ

హైదరాబాద్‌ సిటీ, హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్‌లు వంటి వాటి విక్రయాలపై నిషేధం విధిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తాజాగా సర్క్యులర్‌ జారీ చేసింది. అన్ని పాఠశాలల్లో ప్రభుత్వం రూపొందించిన సిలబస్‌ పుస్తకాలను ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లల్లో చదివే ప్రతీ విద్యార్థి స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌సిఈఆర్‌టి) సంస్థ రూపొందించిన సిలబ్‌సనే చదవాలి. ఈమేరకు ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వమే ఉచితంగా పుస్తకాలను సరఫరా చేస్తోంది. ప్రైవేట్‌ పాఠశాల్లోని విద్యార్థుల కోసం ప్రభుత్వమే పబ్లిషర్లను ఎంపిక చేసి పుస్తకాలను ముద్రింపజేస్తోంది.


ఇలా ప్రతి ఏటా సుమారు 2.5 లక్షల పాఠ్యపుస్తకాల సెట్‌లను పబిషర్ల ద్వారా ముద్రింప చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. అయితే ప్రతిసారీ ఇలా పెద్ద ఎత్తున పాఠ్యపుస్తకాలు మార్కెట్లోకి తీసుకెళుతున్నా అవి అమ్ముడు పోవడం లేదు. ప్రైవేట్‌ స్కూళ్ల విద్యార్థులకు కూడా తప్పకుండా ప్రభుత్వ రూపొందించిన సిలబస్‌ పుస్తకాల ద్వారానే బోధన సాగించాలంటూ గతంలో ప్రభుత్వం జీవో నంబరు 1 ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయినా సరే మెజారిటీ ప్రైవేట్‌ స్కూళ్లల్లో ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రాంతాలకు చెందిన పబ్లిషర్లు రూపొందించిన ఇతర పుస్తకాలను సరఫరా చేస్తున్నారు. ఆయా స్కూళ్ల యాజమాన్యాలతో సదరు పబ్లిషర్స్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుని ఈ పుస్తకాలను విద్యార్థులకు అంటగడుతున్నారు.


ప్రభుత్వం రూపొందించిన సిలబస్‌ పుస్తకాల ధర సుమారు రూ. 250 నుంచి రూ. 300ల వరకు ఉంటే స్కూళ్లు అందించే పుస్తకాల ధరలు ఏకంగా రూ. 1200 నుంచి రూ. 4 వేల వరకు ఉంటున్నాయి. దీని వల్ల విద్యార్థులపై ఆర్థిక భారం పడడమే కాకుండా, ప్రభుత్వం రూపొందించిన సిలబస్‌ కూడా ఇందులో ఉండదు. దీని వల్ల ప్రభుత్వం అనుమతించిన పబ్లిషర్లు నష్ట పోతున్నారు. అందుకే విద్యాశాఖ ప్రైవేటు బడుల్లో వాటి విక్రయాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే తాజా సర్క్యులర్‌తో సమస్య తీరదని ప్రభుత్వ పబ్లిషర్లు అంటున్నారు. అన్నిచోట్ల ప్రభుత్వం ఆమోదించిన సిలబస్‌ పుస్తకాలే వినియోగించేలా కఠిన తీసుకోవాలని వారు అభ్యర్థిస్తున్నారు.

Updated Date - Jun 01 , 2024 | 03:12 AM

Advertising
Advertising