ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెళ్లింట సంతోషం ముగియకముందే..

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:37 AM

ఇంట్లో పెళ్లి జరిగిన సంతోషం మూడు రోజులు కాకముందే విషాదం నెలకొంది.

బడుగుల వెంకటయ్య (ఫైల్‌ఫొటో)

కుమార్తె పెళ్లి చేసిన మూడు రోజులకే భార్యాభర్తల మధ్య గొడవ

పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్యాయత్నం

భర్త మృతి, భార్య పరిస్థితి విషమం

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలో ఘటన

గుర్రంపోడు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆ ఇంట్లో పెళ్లి జరిగిన సంతోషం మూడు రోజులు కాకముందే విషాదం నెలకొంది. కుమార్తెకు పెళ్లి చేసిన ఆ దంపతులు ఆర్థిక ఇబ్బందుల విషయంలో గొడవ పడ్డారు. మాటామాట పెరగడంతో ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఈ ఘటనలో భర్త మృతిచెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని మొసంగి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మొసంగి గ్రామానికి చెందిన బడుగుల వెంకటయ్య(40), జ్యోతి(35) దంపతులకు ఇద్దరు కుమార్తెలు(కవలలు), కుమారుడు ఉన్నాడు. చిలకాపురం గ్రామానికి చెందిన వెంకటయ్య బావమరిది అయిన కొండల్‌తో ఈ నెల 17వ తేదీన పెద్ద కుమార్తె రమణ వివాహం జరిపించారు. వెంకటయ్య తనకున్న మూడెకరాల భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగు చేస్తుంటాడు. ఇటీవల పెళ్లి కోసం కొంత అప్పు తెచ్చినట్టు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల విషయమై ఆదివారం సాయంత్రం భార్యాభర్తలు గొడవపడి పురుగుల మందు తాగారు. కుటుంబసభ్యులు, స్థానికులు గమనించి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా వెంకటయ్య మార్గమధ్యలో మృతిచెందాడు. భార్య జ్యోతి నల్లగొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటయ్య మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఏఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. తండ్రి మృతదేహం మార్చురీలో, తల్లి చికిత్స పొందుతూ ఐసీయూలో ఉండటంతో కుటుంబ సభ్యులతో ఆస్పత్రి ఆవరణలో కన్నీరుమున్నీరవుతున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:37 AM