ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: ఎస్‌హెచ్‌జీ సభ్యులు పారిశ్రామికవేత్తలు కావాలి

ABN, Publish Date - Nov 16 , 2024 | 03:39 AM

ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా అధికారులు సహకరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. శుక్రవారం ప్రజాభవన్‌లో ‘మహిళా శక్తి పథకం’పై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

  • పవన విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు తోడ్పడండి

  • బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు అందేలా చూడండి

  • అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా అధికారులు సహకరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. శుక్రవారం ప్రజాభవన్‌లో ‘మహిళా శక్తి పథకం’పై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల సమాఖ్యల ద్వారా రాష్ట్రంలో పెద్దఎత్తున పవన విద్యుత్తు ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. దాదాపు రూ.4 వేల మెగావాట్ల పవన విద్యుత్తు ఉత్పత్తి కావాలని ఆకాంక్షించారు. సంఘాలు పవన విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేలా సహకరించాలని, అందుకు అవసరమైన స్థలాలను సేకరించి, లీజుకివ్వాలని అధికారులకు సూచించారు.


బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల వారు 99 శాతం మేర రుణాలను తిరిగి చెల్లిస్తున్నారని, ఈ విషయాన్ని బ్యాంకర్లకు వివరించి, రుణాలు అందేలా చూడాలని చెప్పారు. సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో బ్యాంకర్లు కూడా రుణాలు ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. అందుకే ఈ విషయంలో అధికారులు మరింత చొరవ తీసుకోవాలని, మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా సహకరించాలని చెప్పారు. తద్వారా గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత బలపడతారని అన్నారు. సంఘాలకు బస్సులను కూడా కొనివ్వాలని ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు. ముఖ్యంగా పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి, విద్యుత్తు శాఖల అధికారులు పవన విద్యుత్తు విషయంలో సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా, పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకే్‌షకుమార్‌, సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 03:39 AM