ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: రేషన్‌కు, సంక్షేమ పథకాలకు వేర్వేరు కార్డులు

ABN, Publish Date - Aug 05 , 2024 | 03:21 AM

చౌక దుకాణాల్లో రేషన్‌ తీసుకునేందుకు, సంక్షేమ పథకాలను పొందేందుకు వేర్వేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న అంశంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

  • త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం

  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): చౌక దుకాణాల్లో రేషన్‌ తీసుకునేందుకు, సంక్షేమ పథకాలను పొందేందుకు వేర్వేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న అంశంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. సచివాలయంలో ఆదివారం ప్రజావాణి ఫిర్యాదులపై జరిగిన సమీక్ష సందర్భంగా.. ప్రజావాణికి కొత్త రేషన్‌ కార్డులు, పెన్షన్లు, ధరణికి సంబంధించిన ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు అధికారులు డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క స్పందిస్తూ రేషన్‌ కార్డులకు సంబంధించి ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. అలాగే కొత్త పెన్షన్లనూ త్వరలో మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ డెస్క్‌లను బలోపేతం చేసేలా చర్యలు చేపడితే సీఎంఆర్‌ఎ్‌ఫకు సంబంధించి ఫిర్యాదులు తగ్గిపోతాయని అభిప్రాయపడ్డారు. ప్రజావాణి విభాగంలో పని చేసేందుకు పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాలని అధికారులు కోరగా.. తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎంచెప్పారు. ప్రజావాణి పనితీరుపై మూడు నెలకోసారి సమీక్ష నిర్వహిస్తానన్నారు.


  • మార్చి కల్లా యాదాద్రిలో విద్యుదుత్పత్తి

వచ్చే మార్చికల్లా ఎట్టి పరిస్థితుల్లో యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నుంచి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి జరిగి తీరాల్సిందేనని జెన్‌కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పనుల పురోగతిపై సచివాలయంలో జెన్‌కో అధికారులతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. యాదాద్రి నాలుగు యూనిట్లనూ దశల వారీగా వచ్చే మార్చి కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు.. అందుబాటులో ఉన్న స్థలాల్లో 20 సమీకృత గురుకుల సముదాయాలను నిర్మించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. సచివాల యంలో ఆయన విద్యాశాఖ, ఆర్‌అండ్‌బీ, ప్రైవేటు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో గురుకులాల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. తొలిదశ నిర్మాణా లు వచ్చే ఏడాది జూన్‌ కల్లా పూర్తికావాలన్నారు.

Updated Date - Aug 05 , 2024 | 03:22 AM

Advertising
Advertising
<