TS News: ప్రజా సమస్యలే అజెండాగా అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు
ABN , Publish Date - Feb 08 , 2024 | 10:44 AM
ప్రజా సమస్యలే అజెండాగా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బాట పట్టనున్నారు. రాత్రి సీనియర్ నేత రామచంద్రరావు నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం హాజరు కాలేదు.
హైదరాబాద్: ప్రజా సమస్యలే అజెండాగా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బాట పట్టనున్నారు. రాత్రి సీనియర్ నేత రామచంద్రరావు నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం హాజరు కాలేదు. ఇక వర్చువల్‌గా ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వరరెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, రామారావు పాటిల్ హాజరయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
ఇరిగేషన్, బడ్జెట్ పై గట్టిగా తమ వాయిస్ వినిపించాలని బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. విద్యావ్యవస్థ, విద్యార్థుల సమస్యలపై శాసనసభ మండలిలో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ప్రస్తావించనున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతి రోజు సాయంత్రం భేటీ కావాలని బీజేపీ నిర్ణయించింది. అయితే మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేల్లో గందరగోళం చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్‌ను బీజేపీ నాయకత్వం ఎంపిక చేయలేదు. శాసనసభ పక్షనేత లేకుండానే అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. శాసనసభపక్ష నేత పదవి కోసం పలువురు పార్టీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. దీంతో వారి మధ్య సమన్వయం లోపం కొరవడి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.