Share News

Breaking News: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. వాళ్లకు గుడ్ న్యూస్

ABN , First Publish Date - Nov 19 , 2024 | 06:47 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

 Breaking News: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. వాళ్లకు గుడ్ న్యూస్
Breaking News

Live News & Update

  • 2024-11-19T18:21:19+05:30

    రేపు ఏపీ కేబినెట్ భేటీ..

    • బుధవారం (నవంబర్ 20)న ఏపీ కేబినెట్ భేటీ

    • సాయంత్రం 4గంటలకు అమరావతిలో సమావేశం

    • కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్

      ప్రమోషన్ బోర్డు నిర్ణయాలకు కేబినేట్‌లో ఆమోదముద్ర వేసే ఛాన్స్

    • రాజధాని అమరావతికి సంబంధించి గతంలో గుత్తేదారులకు ఇచ్చిన పనుల టెండర్ల రద్దు కు మంత్రి మండలి ఆమోదం తెలిపే ఛాన్స్

    • ఆయా పనులకు కొత్తగా టెండర్లు పిలిచే విషయంపైనా కేబినేట్‌లో చర్చించి ఆమోదించే అవకాశం

  • 2024-11-19T17:12:17+05:30

    ఉద్యోగుల అటెండెన్స్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

    • సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్ నమోదుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

    • ఇక మీదట ఫేస్ రికగ్నైజింగ్ మిషన్ ద్వారా హాజరు నమోదు

    • రెగ్యులర్ సెక్రటేరియట్ ఉద్యోగులందరూ, అన్ని సర్క్యులేటింగ్ ఆఫీసర్లు, అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందితో సహా, సచివాలయ హెడ్స్ అందరికీ ఫేస్ రికగ్నైజింగ్ అటెండెన్స్

    • సచివాలయంలోని అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ముఖాన్ని గుర్తించే పరికరాల ఏర్పాటు

    • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

  • 2024-11-19T16:22:43+05:30

    శబరిమలలో ఎలుకలు.. పోలీసులకు గాయాలు

    • శబరిమలలో ఎలుకల బెడద

    • పోలీసుల బ్యారక్‌లో ఎలుకలు

    • నిద్రిస్తున్న పోలీసులను కొరికిన ఎలుకలు

    • సన్నిధానం ప్రభుత్వాసుపత్రిలో పోలీసులకు చికిత్స

    • ఎలుకలు కొరికినట్లు నిర్దారించిన వైద్యులు

  • 2024-11-19T16:05:04+05:30

    శాసనసభలో చంద్రబాబు

    • 2027కు పోలవరాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం

    • ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేస్తాం

  • 2024-11-19T15:55:20+05:30

    శాసనసభలో చంద్రబాబు

    • పోలవరం ప్రాజెక్టుకు రూ.55వేల కోట్లు ఖర్చవుతుంది

    • 350 టీఎంసీల నీళ్లు ఉపయోగించుకునే అవకాశం వస్తుంది

    • ప్రాజెక్టు వల్ల కుడికాల్వ ద్వారా 3లక్షల 20వేల ఎకరాలకు నీరు వస్తుంది

    • ప్రాజెక్టు వల్ల ఎడమ కాల్వ ద్వారా 4లక్షల ఎకరాలకు నీరందుతుంది

    • మొత్తం 7లక్షల 20వేల ఎకరాలకు కొత్త ఆయుకట్టు వస్తుంది

    • 24 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది

    • 80 టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి కృష్ణాకు తరలించే వెసులుబాటు కలుగుతుంది

    • 23.44 టీఎంసీల నీటిని విశాఖతో పాటు మిగతా ప్రాంతాలకు తరలించవచ్చు

    • 900 మెగావాట్ల విద్యుత్తు సమకూరుతుంది

  • 2024-11-19T15:50:30+05:30

    శాసనసభలో చంద్రబాబు

    • ఓ వ్యక్తి దుర్మార్గపు, పనికిమాలిన ఆలోచన రాష్ట్రానికి శాపంగా మారింది

    • ఓ వ్యక్తి చేతకానితనంతో ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయింది

    • 2019-24 మధ్యలో 3.5 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.

    • 2014-19 కాలంలో 75 శాతం పనులు పూర్తి చేశాం

    • టీఎంసీ, క్యూసెక్కులకు తేడా తెలియకుండా ఓ మాజీ మంత్రి సభలో మాట్లాడారు

    • సభలో హుందాతనంగా ఉండాలి

    • సభ్యులు హుందాగా ప్రవర్తించాలి

  • 2024-11-19T15:42:04+05:30

    శాసనసభలో చంద్రబాబు

    • 2019లో ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయింది

    • రివర్స్ టెండరింగ్ పేరుతో అభివృద్ధికి బ్రేకులు వేశారు

    • ఏదైనా తెలియకపోతే తెలుసుకుని పనిచేయాలి

    • మూర్ఖత్వంతో ప్రాజెక్టు పనులను పక్కనపెట్టేశారు

    • అవగాహనలేమితో పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది.

    • వైసీపీ అరాచక పాలనతో ఐదేళ్ల కష్టం వృధా అయ్యింది

  • 2024-11-19T15:39:07+05:30

    శాసనసభలో చంద్రబాబు

    • డయాఫ్రమ్‌వాల్ గురించి అవగాహన లేకుండా గత ప్రభుత్వంలో ఓ ఇరిగేషన్ మంత్రి మాట్లాడారు

    • మాజీ ఇరిగేషన్ మంత్రి పేరును ప్రస్తావించదల్చుకోలేదు

    • అన్ని ప్రాజెక్టులకు డయాఫ్రమ్‌వాల్ ఉంటుందని మాజీ మంత్రి చెప్పారు

    • అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదు

    • 414 రోజుల్లో డయాఫ్రమ్‌వాల్ నిర్మించాం

    • 2014-19 కాలంలో వేగంగా పనిచేసి 72 శాతం ప్రాజెక్టు పనులు పూర్తిచేశాం

    • 22 సార్లు నేరుగా ప్రాజెక్టు వద్దకు వెళ్లా

    • 82సార్లు వర్చువల్‌గా ప్రాజెక్టుపై సమీక్షించాను

  • 2024-11-19T15:34:09+05:30

    శాసనసభలో చంద్రబాబు

    • నదుల అనుసంధానంతో రాయలసీమకు నీళ్లు

    • నదుల అనుసంధానంతో నీళ్ల సమస్యను తీర్చాం

    • రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇచ్చాం

    • నదుల అనుసంధానాన్ని గతంలో వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేసింది

    • రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది

    • హంద్రినీవా ద్వారా గొల్లపల్లి రిజర్వాయరు తీసుకొచ్చి కియా పరిశ్రమను తీసుకొచ్చాం

    • నీళ్లతో వేగంగా అభివృద్ధి జరుగుతోంది

    • 2014-19 వరకు పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించాం

    • నిత్యం ప్రాజెక్టు కోసం ఆలోచించేవాడిని

    • కాంక్రీట్ పనుల్లో చరిత్ర సృష్టించాం

  • 2024-11-19T15:29:31+05:30

    శాసనసభలో చంద్రబాబు..

    • పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి

    • రాష్ట్ర విభజన తర్వాత ఈ రెండింటిపై స్పెషల్ ఫోకస్ పెట్టాం

    • 2014లో అధికారంలోకి రాగానే కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణలో ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయించాం

    • ఏడు మండలాలను విలీనం చేయకపోతే సీఎంగా ప్రమాణం చేయబోనని చెప్పాను

    • ఎన్డీయే, మోదీ సహకారంతో పోలవరం ప్రాజెక్టు కల సాకారమైంది.

  • 2024-11-19T15:14:28+05:30

    జీవో నెంబర్ 16పై వేసిన పిటిషన్ కొట్టివేత

    • జీవో నెంబర్ 16 బాధితులకు హైకోర్టులో నిరాశ

    • కాంట్రాక్టు లెక్చర్లపై ఐటివల ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ను సవాల్ చేస్తూ హైకోర్టు లో పిటిషన్..

    • జీవో నెంబర్ 16 కొట్టివేయాలని హైకోర్టు లో పిటిషన్

    • పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

  • 2024-11-19T14:23:17+05:30

    ఎక్స్‌లో సీఎం రేవంత్

    • వరంగల్ పర్యటనకు ముందు రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్

    • వరంగల్ చరిత్రను వివరిస్తూ ట్వీట్

    • తెలంగాణ ఛైతన్యపు రాజధాని..

    కాళోజీ నుండి పీవీ వరకు…

    మహనీయులను తీర్చిదిద్దిన నేల

    స్వరాష్ట్ర సిద్ధాంతకర్త

    జయశంకర్‌కు

    జన్మనిచ్చిన గడ్డ

    హక్కుల కోసం వీరపోరాటం చేసిన

    సమ్మక్క - సారలమ్మలు నడయాడిన ప్రాంతం.

    దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన..

    చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రం వరంగల్

    • వీరందరి స్ఫూర్తితో మనందరి భవిత కోసం

    • వరంగల్ దశ - దిశ మార్చేందుకు వస్తున్నా అంటూ రేవంత్ ట్వీట్

  • 2024-11-19T12:51:04+05:30

    కేటీఆర్, రేవంత్‌పై ధర్మపురి అర్వింద్ విసుర్లు

    • హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు

    • రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఓల్డ్ సిటీకి వెళ్ళాలని సవాల్

    • పాత బస్తీకి బుల్డోజర్లు పంపాలని అర్వింద్ సూచన

    • పేద ప్రజల జోలికి వెళ్లొద్దని స్పష్టీకరణ

    • కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతి ఎందుకు ?

    • ఎంపీగా ఉన్న సమయంలో నిన్ను తీసుకెళ్లి లోపల వేయలేదా.. ఆ సమయంలో గవర్నర్ అనుమతి తీసుకున్నారా ?

    • మీ చెల్లె కవితా ఎమ్మెల్సీగా ఉంటే అరెస్ట్ చేయలేదా ?

    • అందుకోసం రాష్ట్రపతి అనుమతి తీసుకున్నారా ?

    • కేటీఆర్ ఒక ఎమ్మెల్యే.. తప్పు చేసినట్లు మీ వద్ద ఆధరాలు ఉంటే అరెస్ట్ చేయు

    • ముందు పరిపాలనపై దృష్టిసారించు

    • అగ్రెసివ్‌గా ఆలోచిండచం మాని ప్రోగ్రెసివ్‌గా ఆలోచించు

  • 2024-11-19T11:55:40+05:30

    ఏపీ అసెంబ్లీకి వైఎస్ సునీత

    • అమరావతి: అసెంబ్లీకి వచ్చిన వైఎస్ వివేక కూతురు వైఎస్ సునీతా రెడ్డి

    • తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి చర్చించిన సునీత

    • సుప్రీం కోర్టులో కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన అఫిడవిట్ గురించి ప్రస్తావన

    • ఈ కేసులో అఫ్రూవర్‌గా ఉన్న దస్తగిరి జైళ్ల శాఖకు రాసిన లేఖ పై చర్చించిన డాక్టర్ సునీత

    • హోం మంత్రి అనితతో సమావేశం

    • అసెంబ్లీలో సీఎం కార్యాలయానికి వచ్చిన సునీత రెడ్డి

    • సీఎంవోలో అధికారులతో భేటీ అయిన సునీత

    • తన తండ్రి హత్యకేసులో పురోగతిపై చర్చించిన సునీత రెడ్డి

  • 2024-11-19T10:25:59+05:30

    ఏ ఒక్కరినీ వదలం

    • మదనపల్లి ఫైల్స్ బూడిద చేశారు: మంత్రి అనగాని

    • 2,400 పైచిలుకు ఫైల్స్‌కు నిప్పు పెట్టారు

    • ఆ బూడిద నుంచి కూడా నిజాలు వెలికితీస్తాం

    • తప్పుచేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు

  • 2024-11-19T10:23:11+05:30

    మదనపల్లి ఫైల్స్ దగ్ధంపై మండలిలో దుమారం

    • అమరావతి: మదనపల్లి ఫైల్స్ దగ్ధంపై ఆంధ్రప్రదేశ్ మండలిలో దుమారం

    • సభలో సభ్యుల పేర్లను ప్రస్తావించిన మంత్రి అనగాని సత్యప్రసాద్

    • సభ్యుల పేర్లు ప్రస్తావించడంపై అభ్యంతరం తెలిపిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ

    • తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి

  • 2024-11-19T10:06:07+05:30

    • సీఎంపై అభ్యంతరకర పోస్టులు.. కేసు

    • జీడిమెట్ల: సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు

    • కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జీ బండ మల్లేష్ పై కేసు నమోదు.

    • స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు

  • 2024-11-19T10:00:13+05:30

    వంశీ అనుచరుల అరెస్ట్

    • కృష్ణా: మాజీ ఎమ్మెల్యే వంశీ ముఖ్య అనుచరులు అరెస్ట్

    • ఆరుగురుని అరెస్ట్ చేసిన గన్నవరం పోలీసులు

    • పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వంశీ ముఖ్య అనుచరులు.

    • ఓలుపల్లి మోహన్ రంగ, భీమవరపు యతేంద్ర రామకృష్ణ (రాము), అనగాని రవి, మేచినేని వెంకటేశ్వరరావు (బాబు),

    • గుర్రం అంజయ్య(నాని) గోనూరి సీనయ్యను అదుపులో తీసుకున్న పోలీసులు.

    • కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలింపు.

  • 2024-11-19T09:53:54+05:30

    అందుకే ఈవీ పాలసీ

    • హైదరాబాద్: ఢిల్లీలో కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి వచ్చింది.

    • తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తీసుకొచ్చాం: మంత్రి పొన్నం ప్రభాకర్

    • ఎలక్ట్రిక్ వాహనాలను వాడేలా ఈ పాలసీ ఉంది.

    • ఈవీ వాహనాలపై రోడ్డు టాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు వంద శాతం మినహాయింపు ఇస్తోన్నాం.

    • ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం.

    • కాలుష్యాన్ని తగ్గించాలంటే 15 ఏళ్లు దాటిన వాహనాలు స్వచ్చందంగా స్క్రాప్ చేయాలి

    • హైబ్రిడ్ వాహనాలపై కూడా పన్ను రాయితీపై ఆలోచిస్తున్నాం.

    • వినియోగదారులు ఈవీ వాహనాలు కొనండి

    • కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశం

  • 2024-11-19T09:15:59+05:30

    బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లో రోడ్డు ప్రమాదం

    • హైదరాబాద్: పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ వైపు వస్తోండగా ప్రమాదం

    • డివైడర్ పై దుసుకొచ్చి కరెంట్ పోల్ ఢీ కొట్టిన TS07UM1936 టాటా జీబ్రా కారు

    • డ్రైవర్ నిద్రలోకి వెళ్లడంతో ప్రమాదం.

    • సాప్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులను కారులో తీసుకువెళ్తుండగా ప్రమాదం

    • ప్రమాదం సమయంలో కారులో ముగ్గురు ప్రయాణికులు

    • కారులో ఉన్నవారంతా సేఫ్.

    • డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్.. జీరో ఆల్కహాల్‌గా నిర్ధారణ

    • కారును డివైడర్ వద్ద నుంచి తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు

  • 2024-11-19T06:50:17+05:30

    ఓరుగల్లులో ప్రజాపాలన విజయోత్సవ సభ

    • వరంగల్: వరంగల్‌లో ఈ రోజు కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవ సభ

    • ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు

    • లక్ష మందితో సభ నిర్వహిస్తాం: మంత్రులు

    • విజయోత్సవ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

    • ప్లెక్సీలు, కటౌట్లతో మూడు రంగులమయమైన ఓరుగల్లు

  • 2024-11-19T06:47:33+05:30

    ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.