Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Nov 08 , 2024 | 11:23 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

  Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-11-08T14:07:40+05:30

    జగన్ రాజీనామా చేయు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

    • మచిలీపట్నం: మాజీ సీఎం జగన్ పై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు.

    • అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే జగన్ అయినా, వైసీపీ ఎమ్మెల్యేలు అయినా పదవులకు రాజీనామా చేయాలి.

    • మచిలీపట్నంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర ఛైర్మన్ శొంఠి నాగరాజు ప్రమాణ స్వీకారంలో షర్మిల వ్యాఖ్యలు

  • 2024-11-08T12:59:26+05:30

    తల్లి, చెల్లి సరస్వతి పవర్ కంపెనీ షేర్లు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు: జగన్

    • హైదారాబాద్: నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో జగన్ కేసు విచారణ

    • కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరిన విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాది

    • వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసిన ఎన్సీఎల్టీ

    • సరస్వతి పవర్ కంపెనీలో షేర్ల బదిలీకి సంబంధించి ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్

    • తనకు తెలియకుండా తల్లి, సోదరి అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్న జగన్

    • పిటిషన్‌లో విజయమ్మ, షర్మిల, జనార్దన్‌ రెడ్డిను ప్రతివాదులుగా పేర్కొన్న జగన్

    • షేర్ల బదిలీ ఫారాలు, ఇతర డాక్యుమెంట్లు ఏమీ సమర్పించకుండానే తమ పేర్ల మీదకు మార్చుకున్నారన్న జగన్

    • జగన్, భారతీ, క్లాసిక్ రియాల్టీ పేర్ల మీద ఉన్న 51.01 శాతం షేర్లను యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్

  • 2024-11-08T12:09:48+05:30

    సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

    • హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా కేటీఆర్ వరస ట్వీట్లు

    • సీఎం రేవంత్‌కు వ్యంగ్యంగా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ పోస్ట్

    • మెఘా కృష్ణారెడ్డి కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టేందుకు రేవంత్ రెడ్డికి దమ్ముందా అంటూ ప్రశ్న

    • నన్ను అరెస్టు చేసేందుకు రేవంత్ ఉవ్విళ్ళూరుతున్నాడు

    • సుంకిసాల ఘటనలో మెఘాను బ్లాక్‌ లిస్ట్ చేసే దమ్ముందా

    • మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా

    • ఆ ‘ఆంధ్రా కాంట్రాక్టర్‌’ని తన ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ని కొడంగల్‌ లిఫ్ట్ ఇరిగేషన్‌ నుండి తీసివేయడానికి? దమ్ముందా? లేదా?

    • సీఎం అయ్యుండి మేఘాకు గులాంగిరీ చేస్తున్నావా?! అంటూ కేటీఆర్ విసుర్లు

  • 2024-11-08T11:39:12+05:30

    రఘురామ కేసు విచారణ

    • ఢిల్లీ: ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు కస్టడీయల్ టార్చర్ కేసు విచారణ మరోసారి వాయిదా

    • ఈనెల 25న విచారణ చేపడుతామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం

    • తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్

    • ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం

    • ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ తమకు నిన్ననే అందిందని, రిజాయిండర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన విజయ్ పాల్ న్యాయవాదులు

    • రెండు వారాలు గడువు ఇస్తున్నట్లు స్పష్టం చేసిన జిస్టిస్ విక్రమ్ నాథ్, జిస్టిస్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం

    • ఆ తర్వాత వాయిదా ఇవ్వను.. ఆరోజే అన్ని విషయాలపై నిర్ణయం: జిస్టిస్ విక్రమ్ నాథ్

    • ఈ నెల 25న తుది విచారణ చేపడుతామని స్పష్టం చేసిన ధర్మాసనం

  • 2024-11-08T11:28:31+05:30

    • సుప్రీంకోర్టు కీలక తీర్పు

    • ఢిల్లీ: అలీగఢ్ యూనివర్సిటీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

    • వర్సిటీకి మైనారిటీ హోదా ఉందని తేల్చిన సర్వోన్నత న్యాయస్థానం

    • 4:3 మెజారిటీతో తీర్పునిచ్చిన ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం

  • 2024-11-08T11:23:19+05:30

    ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.