Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Sep 29 , 2024 | 08:51 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

  Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-09-29T19:54:47+05:30

    గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం

    • జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్‌లో వర్షం

    • నాంపల్లి, లక్డీకపూల్, మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్‌లో వర్షం

    • షేక్ పేట్, మెహదీపట్నం, టోలిచౌకి, గోల్కొండలో వాన

    • గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్‌లోనూ వర్షం

    • నగరవ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

    • జలమయమైన నగర రోడ్లు..

    • ఖైరతాబాద్, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ల కింద నిచిపోయిన వర్షపు నీరు

    • మరో గంట పాటు నగరానికి భారీ వర్ష సూచన

    • లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ హెచ్చరిక

    • మాన్సూన్ బృందాలను సిద్ధం చేసిన బల్దియా

  • 2024-09-29T19:06:36+05:30

    పాత బస్తీ బండ్లగూడలో ముజ్రా పార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

    • నలుగురు ట్రాన్స్‌జెండర్లతో పాటు 8 మంది యువకులు సహా మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    • బండ్లగూడ గౌస్‌నగర్‌లోని లేక్‌వ్యూ హిల్స్‌లో కాంపౌండ్‌వాల్‌తో కూడిన ప్లాట్‌లో గుట్టు చప్పుడు కాకుండా ముజ్రా పార్టీ

    • పక్కా సమాచారంతో రైడ్ చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు

    • బండ్లగూడలోని లేక్ వ్యూ హిల్స్ గౌస్ నగర్‌లో కాంపౌండ్ వాల్ ఉన్న ప్లాట్‌లో ముజ్రా పార్టీ ఏర్పాటు

    • 8 మంది యువకులు అశ్లీల నృత్యాలు చేస్తున్నట్టు గుర్తింపు

    • నలుగురు ట్రాన్స్‌జెండర్లు అసభ్యకరంగా పెద్దపెద్ద శబ్దాలతో డాన్సులు చేస్తున్నట్లు గుర్తించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

    • యాంప్లిఫైయర్-1, లౌడ్ స్పీకర్ -1, ఒక సౌండ్ బాక్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

  • 2024-09-29T18:10:18+05:30

    తిరుమల లడ్డూ వ్యవహారంపై గుడివాడ అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • తిరుపతి లడ్డూను కూటమి నేతలు రాజకీయం చేస్తున్నారన్న మాజీ మంత్రి

    • అందుకే నిన్న వైసీపీ నేతలు పూజలు నిర్వహించారు

    • ఇచ్చిన హామీలు అమలు చేయలేక ... లేనిపోనవి ప్రచారం చేస్తున్నారు

    • డైవర్ట్ రాజకీయాల కోసమే తిరుపతి లడ్డూను వివాదంలోకి తీసుకువచ్చారు

    • టీడీపీ మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం ఉంది

    • విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించక పోతే మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పాలి

    • తిరుమల లడ్డూపై సీబీఐ విచారణను కూటమి నేతలు ఎందుకు కోరడం లేదు?

    • లడ్డూ కాదు... కూటమి ప్రభుత్వం అపవిత్రం అయ్యింది

    • మాకు సిట్‌ల మీద నమ్మకం లేదు

    • ఈ విషయంలో సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం

    • లిక్కర్ షాపులు రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది

    • తిరుపతిలో అత్యధికంగా మద్యం షాపులు కేటాయించడాన్ని ఏమనుకోవాలి?

    • రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి... రాష్ట్రంలో సినిమా పోలీసులు వ్యవస్థ ఉంది

  • 2024-09-29T17:33:57+05:30

    లులూ గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ కీలక ట్వీట్

    • ఏపీ రాజధాని అమరావతిలో మాకు ఆహ్వానం పలికిన మీకు ధన్యవాదాలు

    • మీకు, నాకు మధ్య సోదరబంధం 18 సంవత్సరాలుగా కొనసాగుతోంది

    • సీఎంగా ఉన్న మీతో (చంద్రబాబు) జరిపిన చర్చలు చాలా ఫలవంతం అయ్యాయి

    • అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్, ఎనిమిది స్క్రీన్‌ల ఐమ్యాక్స్ మల్టిప్లెక్స్‌ను విశాఖలో ప్రారంభించాలని నిర్ణయించాం

    • విజయవాడలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హైపర్ మార్కెట్‌ను, తిరుపతిలో లాజిస్టిక్ సెంటర్లతో పాటు మోడ్రన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తాం

    • ట్విటర్ వేదికగా ప్రకటించిన లులూ గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ

  • 2024-09-29T17:15:36+05:30

    లులూ గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ కీలక ట్వీట్

    • ఏపీ రాజధాని అమరావతిలో మాకు ఆహ్వానం పలికిన మీకు ధన్యవాదాలు

    • మీకు, నాకు మధ్య సోదరబంధం 18 సంవత్సరాలుగా కొనసాగుతోంది

    • సీఎంగా ఉన్న మీతో (చంద్రబాబు) జరిపిన చర్చలు చాలా ఫలవంతం అయ్యాయి

    • అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్, ఎనిమిది స్క్రీన్‌ల ఐమ్యాక్స్ మల్టిప్లెక్స్‌ను విశాఖలో ప్రారంభించాలని నిర్ణయించాం

    • విజయవాడలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హైపర్ మార్కెట్‌ను, తిరుపతిలో లాజిస్టిక్ సెంటర్లతో పాటు మోడ్రన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తాం

    • ట్విటర్ వేదికగా ప్రకటించిన లులూ గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ

  • 2024-09-29T16:40:59+05:30

    tirumala-laddu.jpg

    తిరుపల్లి లడ్డూ వ్యవహారం.. ఢిల్లీలో తెలుగు విద్యార్థుల నిరసన ర్యాలీ

    • తిరుపతి లడ్డూ ప్రసాద కల్తీకి వ్యతిరేకంగా ఢిల్లీలో తెలుగు విద్యార్థుల నిరసన ర్యాలీ

    • సనాతన ధర్మ విలువల పరిరక్షణకు మద్దతుగా పాదయాత్ర చేపట్టిన ఆలిండియా తెలుగు స్టూడెంట్స్ అండ్ యూత్ అసోసియేషన్

    • ఢిల్లీ గోల్ మార్కెట్‌లోని టీటీడీ ఆలయం నుంచి ఏపీ భవన్ వరకు విద్యార్థుల ర్యాలీ

    • టీటీడీ ఆలయానికి దిష్టి తీసి కొబ్బరికాయలు కొట్టిన విద్యార్థులు

    • తెలుగు విద్యార్థుల ర్యాలీ నేపథ్యంలో టీటీడీ ఆలయం, ఏపీ భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

    • లడ్డూ ప్రసాద కల్తీ అంశంపై సీబీఐతో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసిన తెలుగు విద్యార్థులు

    • ఆలయాల పర్యవేక్షణలో ప్రభుత్వ జోక్యం ఉండరాదని, పీఠాధిపతులు, పండితులకు ఆలయాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాల డిమాండ్లు

    • ప్రసాదం కల్తీ అంశంపై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని అభ్యర్థన

    • మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, కరుణాకార్ రెడ్డి, ధర్మారెడ్డిపై సీబీఐ దర్యాప్తు జరపాలి

    • ప్రసాదం కల్తీకి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆల్ ఇండియా తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్

  • 2024-09-29T16:10:41+05:30

    విజయవాడలో విషాదం

    • స్క్రూ బ్రిడ్జి వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి బందర్ కాలువలో దూకిన తల్లి

    • సంవత్సరంలోపు వయసుగల ఆడపిల్లను వెలికి తీసిన స్థానికులు

    • హాస్పిటల్‌కు తరలించే లోపే చనిపోయిన పసిపాప

    • తల్లి, కుమారుడు కోసం కొనసాగుతున్న గాలింపు

  • 2024-09-29T15:56:15+05:30

    మంగళగిరిలో క్లీన్ అండ్ గ్రీన్‌కు మంత్రి నారా లోకేష్ చర్యలు

    • సొంతంగా కార్మికులను నియమించి గడ్డి తొలగింపు చర్యలు తీసుకున్న మంత్రి నారా లోకేష్

    • సొంతంగా 5 గడ్డి తొలగింపు మిషన్ల కొనుగోలు చేయడంతో పాటు ప్రతి నెల కార్మికులకు జీతాలు చెల్లించనున్న మంత్రి

    • నియోజకవర్గంలో రోడ్లకు ఇరువైపుల ఉన్న గడ్డి, పిచ్చి మొక్కలు తొలగింపు

    • నేటి నుంచి గడ్డి తొలగింపు కార్యక్రమం

    • లోకేష్ చూపిస్తున్న చొరవ పట్ల స్థానికుల హర్షం

  • 2024-09-29T15:46:18+05:30

    మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పార్థివ దేహానికి మాజీ మంత్రుల నివాళులు

    • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి కన్నుమూత

    • పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్ గౌడ్, డాక్టర్ సంజయ్

    • ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీమంత్రి హరీష్ రావు

    • ధైర్యంగా ఉండాలని చెప్పిన హరీశ్ రావు

  • 2024-09-29T15:42:17+05:30

    వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు

    • 2014-19 ఐదేళ్ళ పాలనలో పేదల కల నెరవేరాలన్న ఉద్దేశంతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టాం

    • మనం నిర్మించిన ఇళ్లను పూర్తి చేయకుండా ఇళ్లకు రంగులు మాత్రం వేసుకున్నారు

    • ఐదేళ్లపాటు జగన్ పాలనలో ఎన్నో ఉద్యమాలు చేశాం

    • ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లకు పూర్వ వైభవం తీసుకురావడం కోసం మా ప్రయత్నం

    • ఇళ్ల లబ్ధిదారులను బలవంతంగా రుణగ్రస్తులను చేశాడు

    • పది శాతం పెండింగ్ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అతి త్వరలో ఇళ్లను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం

    • ఒక్క పాలకొల్లులోనే రూ.150 కోట్లు ఇళ్లు తాకట్టుపెట్టి పక్క దారి పట్టించారు

    • పీకల్లోతు నీళ్ళలో కొంతమంది పేదలకు సెంటు పట్టాలు ఇచ్చారు

    • ఐదేళ్లలో ప్రభుత్వమే ఆ స్థలాలను పూడ్చలేకపోయింది

    • చంద్రమండలంపైకి వెళ్లొచ్చేమో కానీ జగన్ ఇచ్చిన సెంటు స్థలాల వద్దకు వెళ్లలేం

    • రాష్ర్ట విభజన కంటే జగన్ పాలన వల్ల ఎక్కువ నష్టం జరిగింది

    • ప్రపంచ స్థాయిలో మళ్ళీ అమరావతిని తిరిగి నిలబెట్టేందుకు మంత్రి నారాయణ కృషి చేస్తారు.

  • 2024-09-29T13:30:00+05:30

    బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై రెక్కీ

    • నా మీద రెక్కీ చేయడం కోసం ఇద్దరు వ్యక్తులు తిరుగుతున్నారు

    • స్థానికులు గమనించి లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు

    • నా ఇంటి చుట్టూ రెక్కీ చేసి ముంబైలో కొందరికి సమాచారం చేరవేస్తున్నారు

    • ఈ అంశాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలి

    • ఇలాంటి వాటికి నేను భయపడను: రాజా సింగ్

  • 2024-09-29T12:00:02+05:30

    • అమరావతి: స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు

    • రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ జీవో విడుదల

    • వారం రోజుల్లో జీవో విడుదల చేస్తామని సీఐఐ సదస్సులో మంత్రి లోకేశ్ హామీ

    • ఇచ్చిన మాట ప్రకారం జీవో ఇప్పించిన మంత్రి నారా లోకేశ్

  • 2024-09-29T11:58:00+05:30

    టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు

    • తిరుపతి: లడ్డూ కల్తీ, సిట్ ఏర్పాటుపై టీజీ వెంకటేశ్ సంచలన కామెంట్స్

    • కుళ్లిపోయిన జంతు కొవ్వు నార్త్ ఇండియాలో ఎక్కువ దొరుకుతుంది

    • విదేశాలకు సోపు సరఫరా చేయాలంటే జంతు కొవ్వు కలపలేదు అని డిక్లరేషన్ ఇవ్వాలి

    • విదేశీ వినియోగదారులకు సోపు పంపాలంటే ఇన్ని ఆంక్షలు ఉంటాయి

    • అలాంటపుడు నెయ్యిలో కల్తీ కాకుండా ఎంత కట్టుదిట్టమైన చర్యలు ఉండాలి

    • వనస్పతి అంటే కూడా రైస్ ఆయిల్, జంతువుల ఆయిల్ కూడా కలుస్తుంది

    • కేసు పెట్టాలంటే.. కల్తీ జరిగిదంటే చాలు.. జంతు కొవ్వు ఉందా లేదా అనేది అనవసరం. కల్తీ జరిగిందనేది నిజం... మరో ఆలోచన లేదు

    • నెయ్యి ప్యూర్‌గా లేకుండా ఏది కలిపినా కల్తీ అయినట్టే... శిక్ష ఒక్కటే

    • హత్య చేసేపుడు కత్తి అయినా, తుపాకి అయినా ఒక్కటే

    • కల్తీ అయ్యింది. కేసు పెట్టేసి, వేరే అంశాలపై ప్రభుత్వం ద్రుష్టి పెడితే మంచిది

    • సీఎం ఎప్పుడూ విద్యార్థిగానే ఉండాలి.

    • లడ్డూ క్వాలిటీ బాగలేదని భక్తులు ఎన్నో సార్లు ఫిర్యాదు అయితే చేస్తూనే ఉన్నారు

    • రాజులు, వారి పెట్టిన సామంతరాజులు సరిగ్గా ఉంటే ఇవ్వన్నీ జరిగి ఉండదు

    • సిట్ పైన వారికి నమ్మకం లేకపోతే, సీబీఐపైన కూడా వారికి లేదు. అందుకే వారు గతంలో వారి కేసుల్లో సీబీఐకి కూడా సహకరించలేదు

    • టీటీడీ పాలకమండలికి మాలాంటి వారు అనర్హులం : టీజీ వెంకటేశ్

    • హైడ్రా బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి.

    • అసైన్డ్ భూములను అమ్మిన వారు, వాటిని రిజిస్త్రేషన్ చేసిన రిజిస్టర్, రెవిన్యూ అధికారులు అందరిపైన చర్యలు తీసుకోవాలి

  • 2024-09-29T10:19:19+05:30

    • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృ వియోగం

    • హైదరాబాద్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి కన్నుమూత

    • సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు

    • పురుషోత్తమ్ రెడ్డి మృతిపై సీఎం రేవంత్ సంతాపం

  • 2024-09-29T09:00:38+05:30

    బ్రిడ్జీ నిర్మాణంపై రాజకీయ రగడ

    • హనుమకొండ:నయీంనగర్ బ్రిడ్జీ నిర్మాణంపై రాజకీయ రగడ

    • బ్రిడ్జీ తమ హయాంలో శాంక్షన్ ఇచ్చామంటోన్న మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

    • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక శాంక్షన్ ఇచ్చి నిర్మించామంటోన్న వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

    • వినయ్ భాస్కర్ ఈ రోజు ఉదయం 9:30కు చర్చకు రావాలని  సవాల్

  • 2024-09-29T08:57:24+05:30

    ఛత్తీస్ గఢ్‌లో బాంబ్ పేలుళ్లు

    • బీజాపూర్ జిల్లాలో ఐఈడీ పేలుళ్లు

    • మావోయిస్ట్‌లు అమర్చిన ఐఈడీ

    • ఐఈడీ పేలి ముగ్గురు సీఆర్ఫీఎఫ్ జవాన్లకు గాయాలు

    • కూంబింగ్ చేస్తుండగా తర్రెం అటవీ ప్రాంతంలో ఘటన

    • గాయపడ్డ జవాన్లు ఆస్పత్రికి తరలింపు

  • 2024-09-29T08:51:39+05:30

    ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.