ఎంపీ రంజిత్‌రెడ్డిపై కేసు
ABN, Publish Date - Jan 24 , 2024 | 03:09 AM
బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఫోన్‌లో బెదిరింపు ధోరణితో మాట్లాడిన చెవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 20న విశ్వేశ్వర్‌రెడ్డికి ఎంపీ
బంజారాహిల్స్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఫోన్‌లో బెదిరింపు ధోరణితో మాట్లాడిన చెవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 20న విశ్వేశ్వర్‌రెడ్డికి ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్ చేశారు. తమ పార్టీ సర్పంచ్‌తో ఎందుకు మాట్లాడుతున్నావంటూ ప్రశ్నించారు. తనను దుర్భాషలాడడుతూ.. తీవ్రస్థాయిలో బెదిరించారని విశ్వేశ్వర్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జీడీ ఎంట్రీ చేసి న్యాయ సలహా నిమిత్తం ఫిర్యాదు కాపీనీ కోర్టుకు పంపించారు. కోర్టు సలహా వచ్చిన నేపథ్యంలో ఎంపీ రంజిత్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.
Updated Date - Jan 24 , 2024 | 10:53 AM