Share News

CM Revant Reddy: తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి జలసౌధకు సీఎంతెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి జలసౌధకు సీఎం

ABN , Publish Date - Sep 26 , 2024 | 03:20 AM

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి జలసౌధలో ముఖ్యమంత్రి అడుగుపెట్టనున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నీటిపారుదల రంగంపై రూ.1.80లక్షలకోట్లు వెచ్చించినా.. ఏ రోజూ జలసౌధ వైపు కేసీఆర్‌ కన్నెత్తిచూడలేదు.

CM Revant Reddy: తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి జలసౌధకు సీఎంతెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి జలసౌధకు సీఎం

  • కొత్త ఏఈఈలకు నేడు నియామక పత్రాలు ఇవ్వనున్న రేవంత్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి జలసౌధలో ముఖ్యమంత్రి అడుగుపెట్టనున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నీటిపారుదల రంగంపై రూ.1.80లక్షలకోట్లు వెచ్చించినా.. ఏ రోజూ జలసౌధ వైపు కేసీఆర్‌ కన్నెత్తిచూడలేదు. ఇందులో ఐదేళ్లపాటు నీటిపారుదలశాఖ ఆయన వద్దే ఉండటం గమనార్హం. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి గురువారం జలసౌధకు రానుండడంతో సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీజీపీఎస్సీ నియామక ప్రక్రియలో ఎంపికైన 677 మంది అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు(ఏఈఈ)లకు సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందించనున్నారు.


ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులందరూ గురువారం సాయంత్రం 4 గంటల కల్లా జలసౌధ కార్యాలయానికి చేరుకోవాలని ఈఎన్‌సీ(అడ్మిన్‌) జి.అనిల్‌కుమార్‌ కోరారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 1800 మంది లష్కర్ల నియామకంపై సీఎం రేవంత్‌, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. అనంతరం కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ చైర్మన్లతో సీఎం కాసేపు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. ఆ తర్వాత పూడికతీతపై జాతీయ పాలసీని అన్వయం చేసుకునే అంశంపై నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు.

Updated Date - Sep 26 , 2024 | 03:20 AM