Share News

Hyderabad: గవర్నర్‌తో సీఎం భేటీ

ABN , Publish Date - Nov 07 , 2024 | 02:39 AM

సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రం కొత్త ఆర్వోఆర్‌ ముసాయిదాపై సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించాల్సి ఉండగా.. ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.

Hyderabad: గవర్నర్‌తో సీఎం భేటీ

  • కీలక సదస్సు వాయిదా వేసుకొని మరీ సమావేశం

  • ఫార్ములా-ఈ వ్యవహారంలో కేటీఆర్‌ పాత్రపై వివరణ?

  • రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన కులగణన గురించి వెల్లడి

సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రం కొత్త ఆర్వోఆర్‌ ముసాయిదాపై సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించాల్సి ఉండగా.. ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. సాయంత్రం 7 గంటల సమయంలో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ శర్మతో అరగంటపైగా భేటీ అయ్యారు. ఫార్ములా-ఈ వ్యవహారం, అందులో కేటీఆర్‌ పాత్రపై ఆయనకు సీఎం వివరించినట్లు తెలుస్తోంది.


అయితే.. అధికారిక వర్గాలు మాత్రం.. బుధవారం నుంచి ప్రారంభమైన కులగణన తీరును గవర్నర్‌కు వివరించేందుకే సీఎం రాజ్‌భవన్‌ వెళ్లినట్లు చెబుతున్నాయి. 2025లో దేశవ్యాప్తంగా జరగనున్న జనగణనలోనూ ఈ సర్వేను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్లు పేర్కొన్నాయి. అదేవిధంగా తన సోదరుడి కుమార్తె వివాహానికి సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌ను ఆహ్వానించారు.

Updated Date - Nov 07 , 2024 | 02:39 AM