ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Banjara Hills: బొద్దింక బిర్యానీ.. హైదరాబాద్‌లో కలకలం

ABN, Publish Date - Nov 28 , 2024 | 06:44 PM

నగరంలోని పలు ప్రాంతాల్లో హోటళ్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో ప్రముఖ హోటళ్లలో సైతం శుభ్రత పాటించక పోవడంతోపాటు.. కుళ్లిన మాంసం, పదార్ధాల తయారీ తేదీలు గడిచినా.. వాటినే వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.

హైదరాబాద్, నవంబర్ 28: ముత్యాలకే కాదు.. బిర్యానీకి సైతం హైదరాబాద్ ఫేమస్. హైదరాబాద్ బిర్యానీ అంటే.. మక్కువ చూపని వారంటూ ఉండరు. గురువారం పలువురు కస్టమర్లు.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-3లోని బిర్యానీవాలా రెస్టారెంట్‌లో బిర్యానీ తినేందుకు వెళ్లారు. బిర్యానీకి ఆర్డర్ ఇచ్చారు. దీంతో వారి వేడి వేడి బిర్యానీ తింటుండగా.. అందులో బొద్దింక ప్రత్యక్షమైంది.

Also Read : ఆగిన విశాఖ ఉక్కు ఉద్యోగుల జీతాలు..చొరవ తీసుకున్న ఎంపీ


దీంతో కస్టమర్లు తీవ్ర ఆందోళన చెందారు. ఆ క్రమంలో హోటల్ యజమానిని వారు నిలదీశారు. బిర్యానీలో బొద్దింక వస్తే.. మేమేం చేస్తామంటూ హోటల్ నిర్వాహకులు కస్టమర్లకు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో బిర్యానీవాల రెస్టారెంట్‌పై కస్టమర్లు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బిర్యానీవాలా రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు.

Also Read: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్


మరోవైపు.. నగరంలోని పలు ప్రాంతాల్లో హోటళ్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో ప్రముఖ హోటళ్లలో సైతం శుభ్రత పాటించక పోవడంతోపాటు.. కుళ్లిన మాంసం, పదార్ధాల తయారీ తేదీలు గడిచినా.. వాటినే వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఆ క్రమంలో ఆయా హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. అయినా.. హోటళ్ల యాజమానుల్లో మాత్రం ఏ మాత్రం మార్పు రావడం లేదు.

Also Read: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం


ఇక తినే అహారంలో బొద్దింక, ఈగ లాంటి జీవుల కళేబరాలు ప్రత్యక్షమైనా.. హోటల్ యజమానులను నిలదీస్తే.. మాత్రం వారి నుంచి నిర్లక్ష్యంగా జవాబు వస్తుంది. ఇంకోవైపు.. ఇటీవల పాతబస్తీలో పలు దుకాణాలపై జీహెచ్ఎంసీ మేయర్ జీ.విజయలక్ష్మీ సారథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణంలో మాంసాన్ని ఎలుక తినడం మేయర్ గమనించారు.

Also Read: ఆ ప్రాంతాల్లో తుఫాన్.. రెడ్ అలర్ట్ జారీ


ఈ సందర్భంగా శుభ్రత పాటించని పలు దుకాణాలను ఆమె సమక్షంలోనే సీజ్ చేశారు. అయితే ఎంఐఎం ఎమ్మెల్సీ బేగ్.. వెంటనే రంగంలోకి దిగారు. సీజ్ చేసిన దుకాణాలను వెంటనే తెరవాలంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులను బెదిరించారు. దుకాణాలు తెరవకుంటే.. మీ ఉద్యోగాలు ఊడతాయంటూ వారిని బెదిరించారు.

Also Read: ఆందోళన వద్దంటూ రైతులకు కీలక సూచన


దీంతో చేసేది లేక.. వారు దుకాణాల తాళాలు తీశారు. ఈ వ్యవహారం మేయర్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎంఐఎం ఎమ్మెల్సీ బేగ్‌పై కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి పరిస్థితుల్లో హోటళ్లు, దకాణాల్లో శుభ్రత, పరిశుభ్రత ఎక్కడి నుంచి వస్తుందంటూ నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు చర్యలు చేపడుతున్నప్పుడు.. రాజకీయ నాయకలు ఇలా జోక్యం చేసుకుంటే ఎలా అంటూ నగర జీవులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

For Telangana News And Telugu News

Updated Date - Nov 28 , 2024 | 07:41 PM