ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్రిప్టో దందా

ABN, Publish Date - Oct 21 , 2024 | 01:42 AM

జిల్లా కేంద్రానికి చెందిన ఓ మద్య తరగతి వ్యాపారి భార్య, ఇద్దరు పిల్లలతో ఉన్నదాంట్లో సంతృప్తిగా బతుకుతున్నాడు. ఆ కాలనీలోని ఓ నేత సుమారు ఆరు నెలల క్రితం కలిశాడు. ఫలానా ఆన్‌లైన్‌ దందా బాగుంది...నేను చాలా పెట్టుబడి పెట్టాను..

- అప్పు చేసి ఆన్‌లైన్‌లో పెట్టి

కాయిన్‌ పెట్టుబడి కోసం ఆస్తులు తాకట్టు

బంగారం, ప్లాట్లు, కార్లు అమ్ముకున్న మధ్యతరగతి జనం

- అత్యాశకు పోయి...అవస్థలు పడుతున్న వైనం

- రూ. కోట్లలో లావాదేవీలు...వందల్లో బాధితులు

జగిత్యాల, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రానికి చెందిన ఓ మద్య తరగతి వ్యాపారి భార్య, ఇద్దరు పిల్లలతో ఉన్నదాంట్లో సంతృప్తిగా బతుకుతున్నాడు. ఆ కాలనీలోని ఓ నేత సుమారు ఆరు నెలల క్రితం కలిశాడు. ఫలానా ఆన్‌లైన్‌ దందా బాగుంది...నేను చాలా పెట్టుబడి పెట్టాను.. లాభాలు వస్తున్నాయి...నువ్వు కూడా పెట్టు...ఎలాంటి టె న్షన్‌ లేదు.. అంతా తాను చూసుకుంటా..అంటూ తన లా భాల లెక్కలు మొబైల్‌ చూపించాడు. వచ్చిన వ్యక్తి సమా జంలో వైట్‌ కాలర్‌గా చలామణి అవుతుండడం వల్ల ఆ మాటలు నమ్మాడు. సదరు వ్యాపారి తొలుత రూ. లక్ష పె ట్టుబడి పెట్టాడు. కొద్ది వారాల తర్వాత రూ. 5 నుంచి 10 లక్షలు పెడితే నెలకు రూ. ఒక లక్ష నుంచి రూ. రెండు లక్షల వరకు వస్తాయని చెప్పడంతో తనకున్న ఓ ప్లాటును విక్రయానికి పెట్టి వచ్చిన అడ్వాన్స్‌ డబ్బులను మరీ పెట్టు బడి పెట్టాడు. సొంత వ్యాపారం మానేసి ఆన్‌లైన్‌ దందా లో మునిగాడు. ఇటీవల ఒక్కసారిగా సదరు ఆన్‌లైన్‌ యా ప్‌ పనిచేయకపోవడంతో కంగు తిన్నాడు. తనను నమ్మిం చిన సదరు నేతకు కాల్‌ చేస్తే ఫోన్‌ ఎత్తడం లేదు. మరో వైపు చైన్‌ లింక్‌ పద్ధతిలో తాను డబ్బులు కట్టించిన వారు గంటకోమారు కాల్‌ చేసి ఒత్తిడి తెస్తున్నారు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో సదరు మద్య తరగతి కుటుంబం అల్లా డుతోంది. ఇలా ఒక్కరు, ఇద్దరు కాదు...వందల సంఖ్యలో అ త్యాశకు పోయి తమ శక్తికి మించి అప్పులు చేసి మరీ ఆన్‌ లైన్‌ దందాల్లో పెట్టుబడులు పెట్టారు. కనీసం సదరు వ్యా పారాల గురించి ఆరా తీయకుండా రూ. లక్షల్లో పెట్టేశారు. తీరా వాటి గురించి ఇప్పుడిప్పుడు తెలుస్తుండటంతో ఒక్కొ క్కరుగా కుమిలిపోతున్నారు.

జగిత్యాలలో జోరుగా..

జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల గల పలు గ్రామా లు, మండలాల్లో కొన్ని నెలలుగా క్రిప్టో దందా జోరుగా జరుగుతోంది. రూ. కోట్లలో లావాదేవీలు జరుగుతున్నట్లు సంబందిత వర్గాలు అంటున్నాయి. పదుల సంఖ్యలో మా ర్కెట్‌లో చలామని అవుతున్న పలు యాప్‌లలో పెట్టుబడు లు పెట్టి వందల సంఖ్యలో బాధితులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఏ నలుగురు కలిసినా జరుగుతున్న చర్చ ఒక్కటే...ఆన్‌లైన్‌ వ్యాపారంలో నేను ఇంత పెట్టాను..నువ్వు ఎంత పెట్టావు అని. ఇలా ఆన్‌ లైన్‌లో పెట్టుబడి పెట్టిన వారు ఎదుటి వారిని ప్రభావితం చేసేందుకు పని గట్టుకొని ప్రచారం చేస్తున్నారు. క్రిప్టో కరె న్సీకి చెందిన పదుల సంఖ్యలో గల యాప్‌ బ్లాక్‌ చైన్‌ దం దాలు మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ఈ ఆన్‌లైన్‌ మోసపూ రిత దందాలో పెట్టుబడులు పెడితే తక్కవ కాలంలో ఎక్కు వ లాభాలు గడించవచ్చనే కేటుగాళ్ల మాటలతో నిత్యం ఎంతో మంది సామాన్యులు దందాల వైపు ఆకర్శితులవు తున్నారు. అప్పులు చేసి దందాలో పెట్టుబడులు పెట్టి మో సానికి గురవుతున్నారు.

శక్తికి మించి డబ్బులు పెట్టి....

జిల్లాలో యూబిట్‌ తతంగం బయటకు వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌ కథలు ఒక్కక్కటిగా వెలుగు లోకి వస్తున్నాయి. ఈ దందాలో ఎక్కువగా మద్య తరగతి కుటుంబాలు, వ్యాపా రులు, యువత, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రియల్‌ వ్యా పారులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి కు టుంబాలు ఈ దందాలో తమ శక్తికి మించి పెట్టుబడులు పెట్టాయి.

ఆన్‌లైన్‌ చైన్‌ దందాలతో లబోదిబో..

పేరు ఏదయినప్పటికీ ఆన్‌లైన్‌ చైన్‌ దందాలన్నీ ఒకేలా పనిచేస్తున్నాయి. మొదట్లో ఆకాశానికెత్తే లాభాలు చూపుతా యి. మెల్లగా చైన్‌ లింక్‌ దందాలో ఇరికిస్తాయి. ఇక నువ్వు కూడా ఓ అయిదుగురి చేస్తేనే నీకు లాభాలు వస్తాయి. అనే పరిస్థితికి తీసుకువస్తాయి. అధిక లాభాలు వస్తాయ న్న అత్యాశతో రూ. లక్షల్లో పెట్టిన పెట్టుబడితో పాటు ఎం తో కొంత లాభాలను పొందాలని ఆ దందాల్లో కూరుకు పోతున్నారు. తాజాగా జిల్లాలో బయటపడిన యూనిట్‌ బిజినెస్‌లో ఇలా ఇరుక్కుపోయిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇందులోనూ అధికశాతం మధ్య తరగతి కుటుంబాలవారే. గతంలోనూ చాలా ఆన్‌లైన్‌ దందాలు ఎన్నో కుటుంబాలను రోడ్డుపాలు చేశాయి.

తరువాయి 8వ పేజీలో..

ఫవాళ్లను చూసే..

పలువురు వ్యాపారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యా పారులు, అధికారులే నేరుగా యూనిట్‌ దందాలో ఉండటమే జిల్లాలో వేగం గా విస్తరించడానికి కారణం. గతంలో చాలా ఆన్‌లైన్‌ దందాలు నిర్వాహకు లు చేసి నట్లే.. ఇందులోనూ సమాజంలో కొంత పేరుండి, వాళ్లు చెబితే పది మంది వింటారు. అనే వాళ్లనే ఎంచుకున్నారు. ప్రధానంగా గ్రామాల్లో పలు వురు ఉద్యోగులు, నేతలు, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగులు, అధికారులు, వైద్యు లు ఇలా...కొన్ని ప్రభావిత వర్గాలను ఎంచుకుని వారిపైనే పూర్తిగా ఫోకస్‌ పెట్టి మరీ చేర్చుకున్నారు. వారు కూడా అత్యాశకు గురై ఈ దందాలోకి రావ డంతో వీరిని నమ్మి మిగిలిన వారంతా చేరుతూ వచ్చారు.

ఫఅయిదుగురిని అరెస్టు చేసిన పోలీసులు..

జగిత్యాలలో రిక్సోస్‌ ట్రేడ్‌ యాప్‌ అను ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా యూఎస్‌డీటీ బీఈపీ20 అను క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టండి..మీకు యూఎస్‌ఏ డాలర్‌ రూపంలో లాభాలు వస్తాయని నమ్మించి మోసానికి గు రిచేసిన అయిదుగురు వ్యక్తులను ఇటీవల టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల పట్టణంతో పాటు బతదికెపల్లి, తాటిపల్లి తదితర గ్రామాల్లో సైతం ఈ దందా వ్యాప్తి చేసి మోసాలకు గురిచేశారని పోలీసులు గుర్తించారు. రూ. 2,52,000ల పెట్టుబడి పెట్టి మరో అయిదుగురి చేర్పిస్తే లాభాలు వ స్తాయని నమ్మించి మోసానికి గురిచేయడంతో సదరు అయిదు గురిని పో లీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈవ్యవహారంలో మరికొంత మంది ఉన్న ట్లు పోలీసు లు అనుమానిస్తున్నారు.

మోసపూరిత యాప్‌లను నమ్మవద్దు..

వేణుగోపాల్‌, టౌన్‌ సీఐ, జగిత్యాల

వెనుకాముందు తెలుసుకోకుండా ఆన్‌లైన్‌ సంస్థలు-యాప్‌లలో పెట్టుబడు లు పెట్టి మోపోవద్దు. ఎవరు కూడా ఊరకే రూ.లక్షల్లో లాభాలను ఇవ్వరన్న విషయాన్ని గ్రహించాలి. చైన్‌లింక్‌ దందాల్లో చాలామంది అమాయకులే బల వుతున్నారు. ఇప్పటికైనా మేల్కొవాలి. ఇలాంటి ఆన్‌లైన్‌ బిజినెస్‌ పెట్టు బడు లు పెట్టి కుటుంబాలను రోడ్డు పాలు చేసుకోవద్దు. ఇలాంటి వారు ఎవరైనా మీ వద్దకు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

Updated Date - Oct 21 , 2024 | 01:42 AM