ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: పనులు చేసి పడిగాపులు

ABN, Publish Date - May 25 , 2024 | 04:17 AM

‘మన ఊరు-మన బడి’ పథకంలో భాగంగా చేసిన పనులకు బిల్లులు రాక పడిగాపులు పడుతున్న కాంట్రాక్టర్ల అవస్థలివి. శిథిలావస్థకు చేరిన సర్కారు బడులను అభివృద్ధి చేసి వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ పథకం పనులు చేసిన కాంట్రాక్టర్లు అప్పులపాలవుతున్నారు.

  • గత ప్రభుత్వ హయాంలోని వాటికి అందని బిల్లులు

  • భోరుమంటున్న ‘మన ఊరు-మన బడి’ కాంట్రాక్టర్లు

  • రూ.లక్షలు పెండింగ్‌లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులు

  • చేసిన అప్పులు తీర్చలేక చితికిపోతున్నామని ఆవేదన

  • అప్పుల ఊబిలో బల్దియా.. రుణభారం 6530 కోట్లు

  • బీఆర్‌ఎస్‌ సర్కారు నిధులివ్వకపోవడంతో అప్పులు

  • ఆర్థిక ఇబ్బందులతో నేడు వేతనాలే ఇవ్వలేని దుస్థితి

  • ఈ నెల 18 నుంచి పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు

సికింద్రాబాద్‌లోని జీపీఎస్‌ కుమ్మరిగూడలో ‘మన ఊరు-మన బడి’ పథకం కింద ఓ కాంట్రాక్టర్‌ గత ప్రభుత్వ హయాంలో పనులు చేశారు. రూ.15 లక్షల విలువైన పనులు చేస్తే.. ఇప్పటివరకు ఆయనకు రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పు తీసుకొచ్చి పనులు చేశానని, వడ్డీల భారంతో సతమతమవుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తిరుమలగిరి మండలంలోని బొల్లారం బాలిక ఉన్నత పాఠశాల, త్రిశూల్‌పార్కులోని బాలుర ఉన్నత పాఠశాలలో ఓ కాంట్రాక్టర్‌ రూ.50 లక్షల చొప్పున రెండు పనులు (మొత్తం రూ.కోటి ) చేపట్టారు. పనులు మొత్తం పూర్తయినా.. ఆయనకు ఇప్పటివరకు రూ.60 లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగతా డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని, నమ్మి పనులు చేసి నట్టేట మునిగినట్టు అయిందని ఆయన వాపోతున్నారు.


‘మన ఊరు-మన బడి’ పథకంలో భాగంగా చేసిన పనులకు బిల్లులు రాక పడిగాపులు పడుతున్న కాంట్రాక్టర్ల అవస్థలివి. శిథిలావస్థకు చేరిన సర్కారు బడులను అభివృద్ధి చేసి వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ పథకం పనులు చేసిన కాంట్రాక్టర్లు అప్పులపాలవుతున్నారు. పనులు చేసి నెలలు గడుస్తున్నా.. బిల్లుల చెల్లింపును పట్టించుకునే వారే కరువయ్యారని బోరుమంటున్నారు. అప్పులు తీసు కొచ్చి చేసిన పనులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘మన ఊరు-మన బడి’ మొదటి విడతలో భాగంగా హైదరాబాద్‌ జిల్లాలో 239 స్కూళ్లను ఎంపిక చేశారు. రూ.30 లక్షలలోపు పనులను హెచ్‌ఎం స్థాయిలో నామినేటెడ్‌ కింద చేసే అవకాశం కల్పించగా.. రూ.30 లక్షలకు పైగా పనులను టెండర్‌ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు.


నామినేటెడ్‌ కింద చేపట్టిన పనులకు బిల్లులు వస్తాయో.. రావో అనే అనుమానంతో చాలామంది తొలుత వెనకంజ వేశారు. దీంతో ఆయా స్కూళ్లకు చెందిన ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపించి కాంట్రాక్టర్లను ఒప్పించి పనులు చేయించారు. మొదటి విడతగా 25 శాతం పనులు చేసిన సమయంలో బిల్లుల కోసం ఇబ్బందులు ఎదురుకావడంతో చాలామంది వెనక్కి తగ్గారు. కొంతమంది మాత్రం అప్పటి బీఆర్‌ఎస్‌ సర్కారుపై నమ్మకంతో.. అప్పులు తెచ్చి మరీ పనులు పూర్తిచేశారు. తీరా బిల్లుల చెల్లింపుల్లో అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోగా బిల్లులు ఇస్తామంటూ ఊరించి.. చివరికి చేతులెత్తేసింది. దీంతో కాంట్రాక్టర్ల పరిస్థితి అగమ్యగోచరమైంది. పనులు చేసి ఏడాది గడుస్తున్నా కనీసం 25 శాతం బిల్లులు కూడా రాలేదని చాలామంది కాంట్రాక్టర్లు భోరుమంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తమపై దయచూపి ఆదుకోవాలని వారు ప్రాధేయపడుతున్నారు.


అప్పుల ఊబిలో జీహెచ్‌ఎంసీ..

కాంట్రాక్టర్ల పరిస్థితి అలా ఉండగా.. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కూడా గత పదేళ్లలో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల చెల్లింపునకూ ఆపసోపాలు పడుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డీపీ), రహదారుల సమగ్ర నిర్వహణ పథకం (సీఆర్‌ఎంపీ), వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఎన్‌డీపీ), జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్ల కోసం.. బల్దియా రూ.6530 కోట్ల రుణాలు తీసుకుంది. నిజానికి.. ఆస్తి పన్ను, భవన నిర్మాణ అనుమతుల జారీ, ఇతరత్రా మార్గాల్లో వచ్చే ఆదాయంతో నగరంలో రహదారుల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ, వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదల వంటి మౌలిక వసతులు ప్రభుత్వమే కల్పించాలి. ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గించేలా వంతెనలు, అండర్‌పా్‌సల వంటి వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి.


అయితే.. 34 వంతెనలు, అండర్‌పా్‌సలు, ఆర్‌ఓబీ/ఆర్‌యూబీలు నిర్మించామని గొప్పలు చెప్పుకున్న గత సర్కారు ఆ పనుల కోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదు. దీంతో ఎస్‌ఆర్‌డీపీ కోసం మునిసిపల్‌ బాండ్ల జారీ, రూపీ టర్మ్‌ లోన్‌ ద్వారా రూ.4250 కోట్ల రుణం తీసుకున్నారు. నగరంలోని రహదారుల నిర్మాణం, నిర్వహణను ప్రయోగాత్మకంగా ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించారు. దీనికోసం రూ.1460 కోట్లు.. నాలాల అభివృద్ధి, విస్తరణకు మరో రూ.680 కోట్లు జీహెచ్‌ఎంసీ అప్పు తీసుకుంది. ఫలితంగా జీహెచ్‌ఎంసీకి వచ్చే ఆదాయం.. వేతనాలు, అప్పులకు వడ్డీ, వాయిదాలు చెల్లించేందుకే చాలడం లేదు. దీంతో కాంట్రాక్టర్ల బిల్లులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంచింది. బిల్లుల చెల్లించనందుకు నిరసనగా.. ఈ నెల 18 నుంచి కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. వర్షాకాలం నేపథ్యంలో నాలాల పూడికతీత పనులు కూడా చేసేది లేదని చెప్పారు.

Updated Date - May 25 , 2024 | 04:17 AM

Advertising
Advertising