Hyderabad: నేచర్ క్యాంపులతో ఒత్తిడి దూరం...
ABN, Publish Date - May 27 , 2024 | 04:45 AM
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ, కుటుంబ బాధ్యతల నిర్వహణతో తీవ్ర ఒత్తిడికి గురవుతూ ప్రకృతిని ఆస్వాధించడం మరిచిపోతున్నాం. అలాంటి వారు నేచర్ క్యాంపులతో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చంటోంది తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ.
రానున్న రోజుల్లో మరిన్ని క్యాంపులు
తెలంగాణ అటవీ అభివృద్థి సంస్థ
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ, కుటుంబ బాధ్యతల నిర్వహణతో తీవ్ర ఒత్తిడికి గురవుతూ ప్రకృతిని ఆస్వాధించడం మరిచిపోతున్నాం. అలాంటి వారు నేచర్ క్యాంపులతో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చంటోంది తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న చిల్కూర్ ట్రెక్కింగ్ ఫారెస్ట్ పార్క్‌లో నేచర్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. తెలంగాణ అటవీ అభివృద్థి సంస్థ ఆధ్వర్యంలో ఎకో టూరిజం కార్యక్రమాలలో భాగంగా ఓ ప్రైవేట్ సంస్థ సహకారంతో నేచర్ క్యాంపు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం నుంచి చేపట్టిన నేచర్ క్యాంపు శిబిరాలు ఆదివారం ఉదయంతో ముగిశాయి.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు నేరుగా అటవీని, అందులోని పక్షులు, జంతువులు తదితర వాటిని ఉత్సాహంగా తిలకించారు. హైకింగ్, రాత్రి పూట ట్రెక్కింగ్ చేశారు. అలాగే రివర్ క్రాసింగ్, వాలీ క్రాసింగ్, క్లింబింగ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ప్రకృతి పర్యాటకానికి పెద్ద పీట వేసి మద్యం నిషేధిత నేచర్ క్యాంపులను ప్రోత్సాహిస్తామని ఈ సందర్భంగా తెలంగాణ అటవీ అభివృద్థి సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రంజిత్‌నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎకో టూరిజం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎకో టూరిజం ప్రాజెక్ట్ మేనేజర్ కె.సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 27 , 2024 | 04:45 AM