Share News

Counseling: నేటి నుంచి వైద్య సీట్ల మొదటి దశ కౌన్సెలింగ్‌

ABN , Publish Date - Sep 27 , 2024 | 03:40 AM

ప్రభుత్వ, ప్రైవేట్‌ మైనారిటీ, నాన్‌ మైనారిటీ మెడికల్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి సంబంధించి మొదటి దశ కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది.

Counseling: నేటి నుంచి వైద్య సీట్ల మొదటి దశ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేట్‌ మైనారిటీ, నాన్‌ మైనారిటీ మెడికల్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి సంబంధించి మొదటి దశ కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది. అందులో మెరిట్‌ జాబితాలో పేర్లున్న అభ్యర్థులంతా ఈనెల 27వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది.


మొత్తం 60 ప్రభుత్వ, ప్రైౖవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోని 5,658 ఎంబీబీఎస్‌ సీట్లను భర్తీ చేయనున్నారు. అందులో 5,125 ఎంబీబీఎస్‌ సీట్లు ప్రభుత్వ, ప్రైౖవేట్‌ నాన్‌ మైనారిటీ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్లు కాగా 330 మైనారిటీ కాలేజీల్లోని ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లు. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ కోటాను ఏడు కాలేజీల్లో అమలు చేస్తామని కాళోజీ వర్సిటీ ప్రకటించింది. గాంధీ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, కాకతీయ మెడికల్‌ కాలేజీలు, ఆదిలాబాద్‌ రిమ్స్‌, సిద్దిపేట, ఈఎ్‌సఐ మెడికల్‌ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ కింద 203 సీట్లు ఉండనున్నాయి.

Updated Date - Sep 27 , 2024 | 03:40 AM