ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గురుకులం.. గందరగోళం..

ABN, Publish Date - Dec 14 , 2024 | 12:09 AM

పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల పట్టింపులేని తనం పేద విద్యా ర్థుల పాలిట శాపంగా మారింది. గురుకుల భవన నిర్మాణానికి నిధులు మంజూరైనా భవనం నిర్మించ డంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు.

చేర్యాలలోని ఇంటిగ్రేటెడ్‌ ఎస్సీ హాస్టల్‌లో కొనసాగుతున్న నర్మెట గురుకుల బాలికల పాఠశాల

మంజూరు ఒక చోట.. నిర్వహణ మరోచోట

నర్మెట గురుకులం జఫర్‌ఘడ్‌లో..

వసతులు లేవని ఇప్పుడు చేర్యాలలో..

అయోమయంలో విద్యార్థులు

భవన నిర్మాణానికి నోచుకోని వైనం..

నిధులు మంజూరైనా పనులు శూన్యం

దూరభారంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

నర్మెట, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల పట్టింపులేని తనం పేద విద్యా ర్థుల పాలిట శాపంగా మారింది. గురుకుల భవన నిర్మాణానికి నిధులు మంజూరైనా భవనం నిర్మించ డంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. దాంతో నర్మెట గురుకుల విద్యార్థులు విద్యా సంవత్స రం నష్టపోకుండా ముందుగా జఫర్‌ఘడ్‌ మండలం లో తాత్కాలికంగా తరగతులను నిర్వహించారు. అక్క డ కూడా సరైన వసతులు లేకపోవడంతో చేర్యాలకు మార్చారు. ఎప్పుడు ఎక్కడికి మారుతుందో తెలియక అటు విద్యార్థులు, ఇటువారి తల్లిదండ్రులు అయోమ యానికి గురవుతున్నారు. అధికారులు స్పందించిన వెంటనే నర్మెటలో భవన నిర్మాణం చేపట్టి ఇక్కడే తర గతులు ఆరంభమయ్యేలా చూడాలని కోరుతున్నారు.

2016లో గురుకులం మంజూరు..

గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అన్ని రకాల వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించేందు కు గత ప్రభుత్వం గురుకులాలను మంజూరు చేసింది. అందులో భాగంగా నర్మెట మండలానికి 2016లో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మంజూరైంది. భవన నిర్మాణం కోసం మండలంలోని హన్మంతాపూర్‌, మల్కపేట గ్రామాల మధ్య సర్వే నెంబర్‌ 94లో సుమారు ఐదెకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. నిధుల మంజూరయ్యాయని అధికారులు చెప్పినా భవన నిర్మాణం పనులు మాత్రం ప్రారంభకాలేదు. పాఠశాల నిర్వహణ కోసం మండలంలో అద్దె భవనం వెతికా రు. పాఠశాల కోసం అనువైన భవనం మండలంలో దొరక లేదు. దాంతో 2016-17 విద్యా సంవత్సరాన్ని 6వ తరగతిని జఫర్‌ఘడ్‌లో ప్రారంభించారు. నర్మెట మండలానికి మంజూరైన పాఠశాలను ఇతర మండలం లో ప్రారంభించడంతో మండ ల ప్రజలు, విద్యార్థినులు అయోమయానికి గురయ్యారు. కొద్ది రోజుల తర్వాత అక్కడ కూడా వసతులు సక్రమంగా లేవని 2017-18, 2018-19 సంవ త్సరాలకు జనగామ, పెంబర్తి గ్రామాల మధ్య ఉన్న భవనంలోకి 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ప్రారంభించారు. పాఠశాల నిర్వహణ ను ప్రాంతాలు మారుస్తున్నారే తప్ప మండలంలో నిర్మాణ పనులను ప్రారంభించడం లేదు.

ప్రస్తుతం చేర్యాలలో...

నర్మెట మండలానికి మంజూరైన గురుకుల పాఠశాలను ఇతర మండలా లలో నిర్వహిస్తున్నారే తప్ప నర్మెటలో నిర్మాణ పనులను చేపట్టడం లేదు. జఫర్‌ఘడ్‌లో ప్రారం భించి కొద్ది రోజుల తర్వాత జనగామకు మార్చారు. అక్కడి నుంచి ప్రస్తుతం చేర్యాల లోని ఇంటిగ్రేటెడ్‌ ఎస్సీ హాస్టల్‌లోకి మార్చారు. పాఠశాల ప్రారంభంలో విద్యార్థినులు సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలో జనగామకు వచ్చే సరికి 560కి తగ్గారు. అక్కడి నుంచి చేర్యాలకు మార్చడంతో 513 మందికి తగ్గారు. పాఠశాల దూరం అవుతుండడంతో విద్యార్థినులు వెళ్లిపోతున్నారని అధికారులు తెలుపుతున్నారు.

దూరభారంతో దూరమవుతున్న విద్యార్థినులు

ఎక్కడ నిలకడ లేకుండా తరచూ పాఠశాలను మారుస్తుండడంతో విద్యార్థినులు అయోమయానికి గురవుతున్నారు. మండలానికి మంజూరైన గురుకుల పాఠశాల మండలంలో లేకపోవడంతో నర్మెట మండలంతో పాటు చూట్టూ పక్కల ఉన్న మండలాల విద్యార్థినులు కూడా గురుకుల పాఠశాల దూరమవుతున్నారు. ఇతర ప్రాంతాల్లో పాఠశాలను నిర్వహిస్తుండడంతో దూరభారం అవుతుంది. దీంతో కొందరు విద్యార్థినులు పాఠశాల నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. నర్మెట మండలానికి మంజూరైన గురుకుల పాఠశాలను నర్మెట మండలంలోనే నిర్వహించాలని ఉమ్మడి మండల ప్రజలు కోరుతున్నారు. మండలంలో పాఠశాలకు అనువైన భవనాన్ని పరిశీలించి ఇక్కడికి మార్చాలని మండల ప్రజలు కోరుతున్నారు.

పర్యవేక్షణ ఇబ్బందిగా మారింది..

- ఎంఈవో ఐలయ్య

మండలానికి సంబంధిం చిన గురుకుల పాఠశాల ఇతర ప్రాంతంలో నిర్వహి స్తుండడంతో జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు పాఠ శాలను పర్యవేక్షించడానికి ఇబ్బంది అవుతుంది. పాఠశాలకు ప్రత్యేక సొసైటీ ఉన్న పాఠశాల వివరాలు మాత్రం నర్మెట విద్యాశాఖ పరిధిలోనే ఉంటాయి. కనీసం విద్యార్థిరుల భోజన వసతుల ను కూడా పరిశీలించలేని పరిస్థితి ఉంది.

పాఠశాల భవనాన్ని నిర్మించాలి

- యాట క్రాంతికుమార్‌, హన్మంతాపూర్‌

నర్మెట మండలానికి మం జూరైన గురుకుల పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి మండలంలోనే నిర్వహించాలి. అన్ని వసతులతో కూడిన పక్క భవనాలను నిర్మించాలి. గతంలో హన్మంతాపూర్‌ గ్రామ సమీపంలో పరిశీలించిన స్థలంలోనైనా, మరో చోటనైనా స్థలాన్ని చూసి పాఠశాల భవనాన్ని నిర్మించాలి.

Updated Date - Dec 14 , 2024 | 12:09 AM