Hyderabad: గదుల కొరత.. వంతుల వెత
ABN, Publish Date - Oct 20 , 2024 | 12:25 PM
జిల్లాలోని 16 మండలాల పరిధుల్లో 691 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 1,12,480 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం స్కూళ్లలో 93 చోట్ల షిఫ్ట్ పద్ధతిన క్లాసులు కొనసాగుతున్నాయి.
- జిల్లాలో దయనీయంగా షిఫ్ట్ స్కూళ్ల నిర్వహణ
- సరిపడా తరగతి గదులు లేక విద్యార్థుల ఇబ్బందులు
- 46 భవనాల్లో.. 93 పాఠశాలల కొనసాగింపు
- పలుచోట్ల వరండాల్లోనే బోధన
హైదరాబాద్(Hyderabad) జిల్లాలో షిఫ్ట్ (వంతుల) స్కూళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. తరగతి గదుల కొరతతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. వంతుల బడి తరగతులను జనరల్ ఫిఫ్ట్‌కు మార్చాలని తల్లిదండ్రులు కోరుతున్నప్పటికీ సరిపడా క్లాస్ రూమ్‌లు లేకపోవడంతో అధికారులు సతమతమవుతున్నారు. ఫలితంగా పలు ప్రాంతాల్లో విద్యార్థుల హాజరుశాతం క్రమేపీ తగ్గుతోంది.
హైదరాబాద్ సిటీ: జిల్లాలోని 16 మండలాల పరిధుల్లో 691 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 1,12,480 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం స్కూళ్లలో 93 చోట్ల షిఫ్ట్ పద్ధతిన క్లాసులు కొనసాగుతున్నాయి. జనరల్, షిఫ్ట్ స్కూళ్లలో టైమింగ్స్ వేర్వేరుగా ఉండడంతో పిల్లలకు బోధనపై ఆసక్తి తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తను కూడా చదవండి: Rachakonda CP: అక్కడికి 9.4 నిమిషాల్లో చేరుకునేలా చర్యలు: సీపీ
6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత క్లాసులు ప్రారంభమవుతుండడంతో చాలామంది పాఠశాలలకు గైర్హాజరవుతున్నారు. మధ్యాహ్నం వచ్చిన వారు సైతం క్లాస్ రూమ్‌ల్లో ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలను సరిగా వినడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. జనరల్ స్కూళ్లలో ఒక పీరియడ్ టైమ్ 45 నిమిషాలు కాగా, షిఫ్ట్ స్కూళ్లలో 30 నిమిషాలు మాత్రమే. దీంతో ఏటా చాలా స్కూళ్లలో పదో తరగతిలో సకాలంలో సిలబస్ పూర్తికాక ఆశించిన ఉత్తీర్ణత రావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఒకే క్లాస్‌రూమ్‌లో రెండు మీడియంలు
జిల్లాలోని 46 భవనాల్లో 93 స్కూళ్లను షిఫ్ట్ పద్ధతిన నడిపిస్తున్నారు. పలుచోట్ల తెలుగు, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులను ఒకే క్లాస్‌రూమ్‌లో కూర్చోబెట్టి పాఠాలు చెబుతుండడంతో ఎవరికీ అర్థంకాని పరిస్థితి నెలకొంది. కొన్ని తరగతులను స్కూల్‌లోని వరండాలోనే నిర్వహిస్తున్నారు. 46 భవనాల్లో కొన్ని అద్దెకు ఉండడం, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం సరిగా లేకపోవడంతో అత్యవసరాలకు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. షిఫ్ట్ స్కూళ్లను జనరల్‌గా మార్చే ప్రక్రియలో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారులు కొద్దిరోజుల క్రితం పాటిగడ్డ, బేగంపేట, గడ్డి అన్నారం ప్రాంతాల్లోని పాఠశాలలను జనరల్‌గా మార్చారు.
టప్పాచబుత్ర, జాంబాగ్ తదితర వంచతుల బడులను కూడా మార్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ తరగతి గదుల కొరతతో తప్పనిసరి పరిస్థితిలో ఇంగ్లిష్, తెలుగు మీడియం స్కూళ్లను జతచేసి పాఠాలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలల్లోని తరగతి గదులకు మరమ్మతులు చేయడంతో ఇటీవల కొన్ని అందుబాటులోకి వచ్చాయి. కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లతోపాటు లైబ్రరీ గదులు, స్టోర్ రూములను ఖాళీ చేయించి షిఫ్ట్ విధానాన్ని సాధ్యమైనంత త్వరగా ఎత్తివేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇటీవల ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Group-1: గ్రూప్-1 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..
ఇదికూడా చదవండి: గద్దర్‌పై మహా పరిశోధన
ఇదికూడా చదవండి: Kishan Reddy: ముందు మూసీకి రిటైనింగ్ వాల్ కట్టండి
ఇదికూడా చదవండి: Train Schedule: ఆ రైళ్ల వేళలు మారాయ్!
Read Latest Telangana News and National News
Updated Date - Oct 20 , 2024 | 12:25 PM