Share News

Bandi Sanjay: రేవంత్‎పై మంత్రులు కుట్ర పన్నుతున్నారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 18 , 2024 | 06:00 PM

జనంలో రేవంత్‎కు వ్యతిరేకత రావాలని కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులే చూస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. గ్రూప్ వన్ అభ్యర్థుల మీద దాడులు చేయడం దారుణమని చెప్పారు. గ్రూప్ వన్ అభ్యర్థులు చేసిన తప్పేంటీ అని ప్రశ్నించారు. ప్రభుత్వం దుర్మార్గంగా, రాక్షసంగా వ్యవహారిస్తోందని ధ్వజమెత్తారు.

Bandi Sanjay: రేవంత్‎పై మంత్రులు కుట్ర పన్నుతున్నారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

కరీంనగర్: కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీఎం పీఠం నుంచి దించాలని కాంగ్రెస్ మంత్రులు చూస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. గోతికాడ నక్కలా రేవంత్‎ను‎ దింపేయాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. హైడ్రా, మూసీ, గ్రూప్-1 విషయంలో జాగ్రత్త పడకపోతే.. రేవంత్ రెడ్డికు చిక్కులు తప్పవని బండి సంజయ్ అన్నారు.


జనంలో రేవంత్‎కు వ్యతిరేకత రావాలని కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులే చూస్తున్నారని అన్నారు. గ్రూప్-1 అభ్యర్థుల మీద దాడులు చేయడం దారుణమని చెప్పారు. గ్రూప్-1 అభ్యర్థులు చేసిన తప్పేంటీ అని ప్రశ్నించారు. ప్రభుత్వం దుర్మార్గంగా, రాక్షసంగా వ్యవహారిస్తోందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టడం దారుణమని అన్నారు. ప్రభుత్వానిది చిల్లర నిర్ణయమని.. పేదల పొట్ట కొడుతారా అని బండి సంజయ్ మండిపడ్డారు. గ్రూప్-1 పరీక్ష రీ షెడ్యూల్ చేయాలని కోరారు. విద్యార్థుల బతుకులను నాశనం చేస్తారా అని నిలదీశారు. ‘రాత్రంతా లాటీ చేస్తారా, మీకు కేసీఆర్‎కు తేడా ఏంటీ’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.


’’15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి..60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామంటారా.. ఇంతకంటే సిగ్గు ఉంటుందా.. కేసీఆర్ దారిలోనే మీరూ వెళ్తారా.. కేసీఆర్, రేవంత్ రెడ్డి దొందూ దొందే..మాజీ మంత్రి కేటీఆర్‎కు కొంచెమన్నా సిగ్గుందా.. గ్రూప్-1 ఉద్యోగులకు బ్రాండ్ అంబాసిడర్ లాగా ఫోజ్ ఇస్తున్నావా. 30 లక్షల నిరుద్యోగుల ఉసురు కేసీఆర్‎కే తగులుతుంది. కేసీఆర్, కేటీఆర్‎లను ఎవరూ నమ్మరు. నేనూ అశోక్ నగ‎ర్‎కు వెళ్తా. నిరుద్యోగుల కంటే నాకు కేంద్ర మంత్రి పదవి ఎక్కువ కాదు’’ అని బండి సంజయ్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Ani Master: జానీ మంచివారు...నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి

Harish Rao: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్‌ ఏ రేంజ్‌లో సవాల్ విసిరారంటే

రేవంత్ రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు

'ఆప్' మాజీ మంత్రికి బెయిల్

మార్కెట్లోకి అదిరిపోయే ఈవీ బైక్.. ఫీచర్లు తెలిస్తే

For More Telangana News and Telugu News..

Updated Date - Oct 18 , 2024 | 06:04 PM