ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: మేము కట్టేవి వద్దన్నారు.. మరి మీరు చేస్తుందేంటి?

ABN, Publish Date - Jan 25 , 2024 | 04:17 PM

Telangana: హైకోర్టు నూతన భవన నిర్మాణానికి కాంగ్రెస్ సర్కార్ స్థలం కేటాయించడంతో పాటు.. అందుకుకావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుండటంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

హైదరాబాద్, జనవరి 25: హైకోర్టు నూతన భవన నిర్మాణానికి కాంగ్రెస్ సర్కార్ (Congress Government) స్థలం కేటాయించడంతో పాటు.. అందుకుకావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుండటంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) స్పందించారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘మేము సచివాలయం కడితే అభ్యంతరం చెప్పారు. కొత్త అసెంబ్లీ కడతామంటే వద్దు అన్నారు. కానీ వాళ్లు వంద ఎకరాల్లో హైకోర్టు కడతామని అంటున్నారు. మరి దీన్ని ఏమంటారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవు అంటున్నారు... మరి సీఎంకు కొత్త క్యాంప్ కార్యాలయం కడుతున్నారు.. అవసరమా?’’ అంటూ ప్రశ్నలు సధించారు. సీఎంలు మారినప్పుడల్లా కొత్త క్యాంప్ కార్యాలయాలు కడతారా? అని నిలదీశారు.

రైతు భరోసా ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్‌‌లో పచ్చి అబద్దం చెప్పారని మండిపడ్డారు. అబద్దం చెప్పిన సీఎం తెలంగాణ రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేపు కేసీఆర్ (BRS Chief Revanth Reddy) పార్లమెంటరీ సమావేశం పెట్టారని.. గాయం తర్వాత కేసీఆర్ మొదటి సమావేశం నిర్వహిస్తున్నారన్నారు. ఎల్లుండి (జనవరి 27) తెలంగాణ భవన్‌లో మైనార్టీ సెల్ సమావేశం ఉంటుందన్నారు. శనివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు ఉంటాయన్నారు. గ్రామ పంచాయితీ భవనాలు ప్రారంభం చేయకుండా ప్రభుత్వం ఆపుతోందని మండిపడ్డారు. సర్పంచ్‌ల మనోభావాలను దెబ్బ తీస్తోందన్నారు.


దమ్ముంటే ఎన్నికలు పెట్టాలని లేదంటే ఉన్న సర్పంచ్‌లకు పొడిగింపు ఇవ్వాలన్నారు. 80 శాతం బీఆర్‌ఎస్ సర్పంచ్‌లే ఉన్నారని ప్రభుత్వం దురాలోచనలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌల్తాబాద్ మండల సర్వసభ్య సమావేశంలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఏ హోదాలో కూర్చున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సలహాదారులు ఉండొద్దని గతంలో కోర్టుకు వెళ్లిందే రేవంత్ రెడ్డి అని గుర్తుచేశారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు పెట్టిన చోట విప్ జారీ చేశామని.. విప్ ధిక్కరిస్తే చర్యలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 25 , 2024 | 04:17 PM

Advertising
Advertising