ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ..

ABN, Publish Date - Oct 05 , 2024 | 09:23 PM

మూసీ నిర్వాసితుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

CM Revanth Reddy

హైదరాబాద్: మూసీ నిర్వాసితుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సెర్ఫ్ సీఈవో ఛైర్మన్‎గా 14మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ(శనివారం) ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నిర్వాసితులు అవుతున్న వారికి ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. తాజాగా వారి విషయంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది.


మూసీ పరివాహక ప్రాంత ప్రజలను తరలించేందుకు కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. అయితే వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సహా వారి జీవనోపాధి కోసం కమిటీని నియమించింది. ఈ ప్రత్యేక కమిటీ మూసీ బాధితులకు ఏ విధంగా ఉపాధి కల్పించవచ్చన్న అంశంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.


రేవంత్ రెడ్డి హామీ..

మరోవైపు శనివారం రోజు కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూసీ నిర్వాసితులను ఆదుకునే అంశంపై ఆయన కీలక ప్రకటన చేశారు. వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వారందరినీ ఆదుకుంటుందన్నారు. ఎవరినీ అనాధలను చేయబోమన్నారు. ప్రత్యామ్నాయం చూపిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎవరైనా వచ్చి రెచ్చగొడితే వారి మాటలను నమ్మొదని, వారి ఫామ్ హౌజ్‌లను కాపాడుకోవడానికే డ్రామాలాడుతున్నారని సీఎం చెప్పారు. నిర్వాసితులు అధైర్యపడొద్దని, ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు.


మూసీ బాధితులకు అండగా ఉన్నట్లు మాట్లాడే వారంతా వారికి ఏం చేద్దామో, ఎలా ఆదుకుందామో చెప్పాలని సీఎం కోరారు. ఇళ్లు ఇద్దామా, డబ్బులు ఇద్దామా, ప్రభుత్వ స్థలాలు ఇద్దామా? అని విపక్ష నేతలను సీఎం ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాన్ని నీటి ప్రమాదం నుంచి కాపాడాలని, ప్రజల మంచి కోసమే ప్రభుత్వం ఆలోచిస్తోందని రేవంత్ అన్నారు. మూసీ దగ్గర ఉన్న వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాళేశ్వరంలో ఒక్క కుటుంబమే రూ.లక్ష కోట్లు మింగిందంటూ కేసీఆర్ కుటుంబం టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేశారు. మూసీ బాధితులు అందరినీ ఆదుకోవడానికి పట్టుమని రూ.10వేల కోట్లు కూడా కావన్నారు. పేదల కోసం పదివేల కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం వెనకాడబోదని సీఎం అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

HYDRA: హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల

KTR: మీ అందరిపై పరువు నష్టం దావా వేస్తా: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

Updated Date - Oct 05 , 2024 | 09:44 PM