CM Revanth Reddy: న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభం: సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Nov 22 , 2024 | 08:56 PM
ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కార్యక్రమాలతో టెక్నాలజీలో హైదరాబాద్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, బయో-టెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్‌గా హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఆయన చెప్పారు.
హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కార్యక్రమాలతో టెక్నాలజీలో హైదరాబాద్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, బయో-టెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్‌గా హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఆయన చెప్పారు. కామన్వెల్త్ మెడ్-ఆర్బ్ కాన్ఫరెన్స్- 2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
Hyderabad: బీఆర్ఎస్, కేసీఆర్‌పై నిజనిర్ధారణ కమిటీ సంచలన ఆరోపణలు..
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "న్యాయవ్యవస్థ మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. కానీ, భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండడం న్యాయవ్యవస్థకు సవాల్‌గా మారింది. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి వేగంగా, సమర్థవంతంగా కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలు అవసరం. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా వీలైనంత త్వరగా సమస్యలు, వివాదాలను పరిష్కరించుకోవాలి. అలా చేయడం వల్ల వివాదంలో చిక్కుకున్న ఇరువర్గాలకూ ఉపయోగకరంగా ఉంటుంది. అందుకు కృషి చేస్తున్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ నిర్వాహకులను అభినందిస్తున్నా.
Adilabad: తుపాకుల సరఫరా కుట్ర గుట్టురట్టు.. సంచలన విషయాలు వెల్లడించిన ఎస్పీ..
మీడియేషన్, ఆర్బిట్రేషన్‌ను సమన్వయం చేస్తే సమస్యలు, వివాదాలను వీలైనంత వేగంగా పరిష్కరించొచ్చు. IAMC అనేది తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. దేశం మొత్తానికి ఈ సెంటర్ ఉపయోగపడుతోంది. ఐఏఎమ్‌సీని గ్లోబల్ ఇన్వెస్టర్లు, బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే పరిమితం చేయొద్దు. కామన్ మ్యాన్, చిన్న సంస్థలకూ దీని సేవలు అందుబాటులోకి తీసుకురావాలి. లండన్, సింగపూర్ తర్వాత ఆర్బిట్రేషన్ మ్యాప్‌లో హైదరాబాద్ నగరం ఉండటం గర్వకారణం. ఆర్బిట్రేషన్ సేవలను పేదలకూ అందుబాటులోకి తీసుకురావడంపై మరో సదస్సు నిర్వహించాలని కోరుతున్నా" అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
KTR: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్..
Mahesh Kumar: అదానీ లంచం వ్యవహారంలో కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీపీసీసీ చీఫ్..