ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth: ప్రభుత్వ పాఠశాలలపై సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం

ABN, Publish Date - Jun 10 , 2024 | 04:55 PM

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు రావట్లేదని సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలను మూసివేయొద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు.

CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు రావట్లేదని సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలను మూసివేయొద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్కార్ పాఠశాలలను సరిగా పట్టించుకోలేదని.. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.


ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి..

ప్రతీ గ్రామం, ప్రతీ తండాకు విద్యను అందించేలా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఉద్ఘాటించారు. శిథిలావస్థకు చేరిన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు.విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం నిర్వహిస్తోందని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించామని తెలిపారు.

ఈరోజు(సోమవారం) రవీంద్రభారతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవు.. ఎవరైనా సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే బాగుండేదన్నారు.


‘‘వందేమాతరం ఫౌండేషన్‌’’కు సీఎం అభినందనలు

‘‘వందేమాతరం ఫౌండేషన్’’ ఇలాంటి మంచి కార్యక్రమం ద్వారా తమ బాధ్యతను గుర్తు చేసిందని తెలిపారు.ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడి సర్కార్ పాఠశాలల విద్యార్థులు రాణించడం ప్రభుత్వానికి గర్వకారణమని అభినందించారు. కార్పొరేట్ పాఠశాలలతో ప్రభుత్వ విద్యార్థులు పోటీపడటం గౌరవాన్ని మరింత పెంచిందని ఉద్ఘాటించారు. విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

90శాతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పాఠాశాలల్లో చదివినవారేనని గుర్తుచేశారు. తనతో సహా ప్రముఖ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారేనని అన్నారు. గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు.


విద్యపై పెట్టుబడి పెడితే సమాజానికి లాభం

రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా తల్లిదండ్రులకు పిల్లల సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. గ్రామాల్లో ఉండే పాఠశాలలపై నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు. విద్య మీద ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యపై పెట్టె పెట్టుబడి పెడితే సమాజానికి లాభాన్ని చేకూరుస్తుందన్నారు. త్వరలో విద్య, వ్యవసాయ కమిషన్లను ఏర్పాటు చేసి నిరంతరం సమస్యలను పరిష్కరించే వెసులుబాటు కల్పించబోతున్నామని చెప్పారు.

10/10 వచ్చిన విద్యార్థుల అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఇంటర్మీడియట్‌లోనూ స్టేట్ ర్యాంకులు సాధించి భవిష్యత్‌లో రాణించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉందని.. ప్రజా పాలనపై నమ్మకం కలిగించేలా ముందుకెళ్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Kaleswaram: కాళేశ్వరం అవకతవకలపై 54 ఫిర్యాదులు.. చంద్ర ఘోష్ కమిటీ విచారణ వేగవంతం

TG Politics: వాటికి రైతుబంధు ఇవ్వం.. కాంగ్రెస్ నేత షాకింగ్ కామెంట్స్

Telangana Politics: గులాబీ బాస్ కీలక నిర్ణయం.. కేటీఆర్ ఔట్.. ఆ పదవి ఎవరికంటే..?

Kishan Reddy: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తా..: కిషన్ రెడ్డి

Read Latest Telangana News and Telugu News

Read more!

Updated Date - Jun 10 , 2024 | 05:16 PM

Advertising
Advertising