Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం
ABN , Publish Date - Sep 20 , 2024 | 10:24 PM
భాగ్యనగరంలో వర్షం పడుతోంది. సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
హైదరాబాద్: భాగ్యనగరంలో వర్షం పడుతోంది. సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడల, నాగోల్, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్, అంబర్‌పేట్, రామంతపూర్, గోల్నాక, నారాయణగూడ వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లో అంధకారం నెలకొంది. ట్రాఫిక్ స్తంభిచడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.
జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం...
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్/కెరమెరి, సెప్టెంబరు 20: జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఓ మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. ఆసిఫాబాద్ మండలంలో ఓ మోస్తరు వర్షం కురియగా కాగజ్‌నగర్‌లో భారీవర్షం కురిసింది. అలాగే కౌటాల, కెరమెరి, సిర్పూర్(టి), దహెగాం, వాంకిడి, పెంచికలపేట, చింతలమానేపల్లి మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగజ్‌నగర్ పట్టణంలో శుక్రవారం సాయం త్రం గంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరింది. అలాగే అంతర్గత రోడ్లు బురదమయం అయ్యాయి. ఉదయం నుంచి ఎండవేడిమితో ఇబ్బందులు పడిన పట్టణవాసులు ఈ వర్షంతో ఉపశమనం పొందారు.