TS By Poll: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బై ఎలక్షన్‌కు నోటిఫికేషన్ జారీ
ABN , Publish Date - Jan 11 , 2024 | 11:52 AM
Telangana: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. గురువారం ఉదయం అసెంబ్లీ కార్యాలయం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రెండు ఎమ్మెల్సీలకు విడివిడిగా నోటిఫికేషన్ జారీ అయ్యింది.
హైదరాబాద్, జనవరి 11: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. గురువారం ఉదయం అసెంబ్లీ కార్యాలయం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రెండు ఎమ్మెల్సీలకు విడివిడిగా నోటిఫికేషన్ జారీ అయ్యింది. నేటి నుంచి ఈనెల 18 వరకు నామినేషన్‌లకు గడువు. ఈనెల 22న నామినేషన్‌ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. జనవరి 29న ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నిక జరుగనుంది. పోలింగ్ ముగిసిన తర్వాత అదే రోజు సాయంత్రం కౌంటింగ్.. ఫలితం వెలువడనుంది.
కాగా.. స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..