TS NEWS: సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జాతీయ నూతన కమిటీ ఎన్నిక
ABN , Publish Date - Mar 06 , 2024 | 08:21 PM
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమే తమ లక్ష్యంగా పని చేస్తామని మాస్ లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్(Pradeep Singh Tagore) అన్నారు. విప్లవ పార్టీలు ఐక్యం కావాలని, ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామని అన్నారు.
ఖమ్మం: సీపీఐ (CPI) ఎంఎల్ మాస్ లైన్ జాతీయ నూతన కమిటీని బుధవారం నాడు ఎన్నుకున్నారు. ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు మాస్ లైన్ మహాసభలు జరిగాయి. 21 మందితో జాతీయ కమిటీ, 9మందితో పోలిట్ బ్యూరో, ముగ్గురితో కంట్రోల్ కమిషన్‌ను ఎన్నుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ సింగ్ ఠాగూర్‌ను ఎన్నుకున్నారు. సుభాష్ దెబా త్రిపుర, పోటు రంగారావు తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ సహాయ కార్యదర్శులుగా ఎంపికయ్యారు. రాయల చంద్రశేఖర్ కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
బీజేపీని ఓడిస్తాం: ప్రదీప్ సింగ్ ఠాగూర్
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ(BJP) ఓటమే తమ లక్ష్యంగా పని చేస్తామని మాస్ లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ (Pradeep Singh Tagore) అన్నారు. విప్లవ పార్టీలు ఐక్యం కావాలని, ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రదీప్ సింగ్ ఠాగూర్ అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి