Telangana: అసెంబ్లీలో ప్రభుత్వం ఆమోదించిన కీలక బిల్లులివే..
ABN , Publish Date - Dec 21 , 2024 | 05:16 PM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఏడు రోజుల పాటు సభ జరుగగా.. 37.44 గంటల పాటు నడిచింది. ఈ సమావేశాల్లో మొత్తం 8 బిల్లులు పాస్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నుంచే..
హైదరాబాద్, డిసెంబర్ 21: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఏడు రోజుల పాటు సభ జరుగగా.. 37.44 గంటల పాటు నడిచింది. ఈ సమావేశాల్లో మొత్తం 8 బిల్లులు పాస్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నుంచే అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడీగా చర్చలు జరిగాయి. ఒకనొక సమయంలో శాసనసభలో యుద్ధవాతావరణమే నెలకొంది. కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన రోజున.. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రచ్చ రచ్చ చేశారు. ఇక అసెంబ్లీ సమావేశాల చివరి రోజున.. అల్లు అర్జున్ అరెస్ట్, పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కీసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన అంశాలపై హాట్ డిస్కషన్ నడిచింది.
ఎనిమిది బిల్లులకు ఆమోదం..
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో నాలుగు అంశాలపై లఘు చర్చ జరిగింది. అలాగే 8 బిల్లులకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. భూ భూరతి 2024, పంచాయితీ రాజ్ చట్ట సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీస్ చట్ట సవరణ బిల్లు, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యూకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సవరణ బిల్లు, తెలంగాణ పేమెంట్స్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్ క్వాలిఫికేషన్ సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
ఇక అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర అప్పులపై లఘు చర్చ జరిగింది. రాష్ట్ర అప్పులపైనా లఘు చర్చ నిర్వహించారు. టూరిజం పాలసీ, గుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. సభలో ఔటర్ రింగ్ రోడ్డు లీజ్‌పై సిట్ విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read:
మీ ఆటలు సాగవిక.. సినీ ఇండస్ట్రీకి సీఎం వార్నింగ్..
నిద్రపట్టడం లేదు.. అశ్విన్ వైఫ్ ఎమోషనల్
డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఏపీ సర్కార్ షాక్..
For More Telangana News and Telugu News..