Share News

Mahesh kumar: హద్దుల్లేని కేటీఆర్‌ అక్రమాలతో వారు బలి

ABN , Publish Date - Dec 20 , 2024 | 01:35 PM

Telangana: ఫార్ములా ఈకార్ రేస్‌ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు అవడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. చట్టపరంగా కేసు నమోదు అయినందున దీనిపై అసెంబ్లీలో కాదు, కోర్టులో తేల్చుకోవాలని సలహా ఇచ్చారు.

Mahesh kumar: హద్దుల్లేని కేటీఆర్‌ అక్రమాలతో వారు బలి
TPCC chief Mahesh Kumar Goud

హైదరాబాద్, డిసెంబర్ 20: మాజీ మంత్రి కేటీఆర్‌పై (Former Minister KTR) ఈ ఫార్ములా కేసు సక్రమమే అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh kumar Goud) అన్నారు. శుక్రవారం మండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఫార్ములా ఈ కారు రేసులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమన్నారు. అక్రమాలు జరిగినట్టు పలు ఆధారాలున్నా... కడిగిన ముత్యమంటూ కేటీఆర్‌ తనకు తానే సర్టిఫికేట్‌ ఇచ్చుకోవడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వం పంపిన ఆధారాలపై గవర్నర్‌ న్యాయసలహా తీసుకొని కేసుకు అనుమతించాక ఇది అక్రమ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

కేటీఆర్‌కు హైకోర్టు షాక్..


చట్టపరంగా కేసు నమోదు అయినందున దీనిపై అసెంబ్లీలో కాదు, కోర్టులో తేల్చుకోవాలని సలహా ఇచ్చారు. హెచ్‌ఎమ్‌డీఏ భాగస్వామ్యం కాకున్నా.. దాని ఖాతా నుంచి ఆర్థికపరమైన అనుమతులు లేకుండానే రూ.54.88 కోట్లు చెల్లించేలా కేటీఆర్‌ ఒత్తిడి తెచ్చారన్నారు. ఆధారాలు కనిపిస్తున్నా.. అక్రమాలకు పాల్పడలేదని కేటీఆర్‌ బుకాయిస్తున్నారని మండిపడ్డారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలాగా కాంగ్రెస్ అక్రమంగా కేసులు బనాయించట్లేదని తెలిపారు. రేసింగ్ స్కాంలో నిబంధనల ప్రకారం గవర్నర్‌ అనుమతి తీసుకునే అధికారులు ముందుకెళ్తున్నారని చెప్పారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగానే నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు ఫండ్స్‌ మంజూరు ఎలా చేస్తారని ప్రశ్నించారు. హద్దుల్లేని కేటీఆర్‌ అక్రమాలతో అధికారులు బలిపశువులుగా మారారన్నారు.


నిబంధనలు పాటించకుండా పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులు బదిలీ చేయడంతో హెచ్‌ఎండీఏ ఆదాయ పన్ను శాఖకు రూ.8 కోట్లకు పైగా పన్ను చెల్లించాల్సి వచ్చిందన్నారు. నిబంధనలను కాదని మూడేళ్లలో రూ.600 కోట్లు చెల్లించేలా ఒప్పందం కేటీఆర్‌ అనుమతితోనే జరిగిందని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఫార్ములా ఈకారు రేసు కోసం 2.8 కి.మీల ప్రత్యేక ట్రాక్‌ను ఏర్పాటు చేశారన్నారు. నిబంధనలను అతిక్రమించి ప్రజలను ఇబ్బంది పెట్టడం హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజిని పెంచడమా అని నిలదీశారు. బీఆర్ఎస్ నేతల దోపిడీతోహైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని వ్యాఖ్యలు చేశారు.

ఫార్ములా ఈరేస్‌ కేసుపై కేటీఆర్ ఏమన్నారంటే


బీఆర్ఎస్ నేతలు ఏం చేసినా వారి స్వలాభం కోసమే? అని.. తెలంగాణ, హైదరాబాద్‌ కోసం కాదని ఈ అక్రమాలే నిరూపిస్తున్నాయన్నారు. ఫార్ములా ఈ కారు రేసు పేరుతో నిధులు గోల్‌మాల్‌ చేసి ఇప్పుడు సుద్ధపూసగా మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఛీకొట్టి గద్దె దింపినా ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమలతో కేటీఆర్ బెదిరింపుల వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కేసులో అధికారులకు సహకరించాల్సిన కేటీఆర్‌ అహంకారంతో విర్రవీగుతూ, ఉద్యమకారులం భయపడం అంటూ కేసుకు సంబంధంలేని మాటలు మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

Lagacharla Case: ప్రభుత్వానికి వ్యతిరేకంగా లగచర్ల రైతుల నినాదాలు..

కేటీఆర్‌ ఎపిసోడ్‌: రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 20 , 2024 | 01:53 PM