14 సీట్లు గెలిపించండి.. పీఎం రేసులో ఉంటా..: కేసీఆర్
ABN, Publish Date - May 11 , 2024 | 05:07 PM
కేంద్ర రాజకీయాల గులాబీ దళపతి కేసీఆర్(KCR) ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను(BRS) 14 సీట్లలో గెలిపిస్తే దేశంలో తెలంగాణ(Telangana) తడాఖా చూపిస్తానని అన్నారు కేసీఆర్. శనివారం నాడు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కేసీఆర్.. దేశ రాజకీయాలపై..
హైదరాబాద్, మే 11: కేంద్ర రాజకీయాల గులాబీ దళపతి కేసీఆర్(KCR) ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను(BRS) 14 సీట్లలో గెలిపిస్తే దేశంలో తెలంగాణ(Telangana) తడాఖా చూపిస్తానని అన్నారు కేసీఆర్. శనివారం నాడు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కేసీఆర్.. దేశ రాజకీయాలపై.. బీజేపీ, కాంగ్రెస్ విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దేశాన్ని శాసించే స్థాయిలో ఉండాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరారు కేసీఆర్. నెక్ట్స్ దేశాన్ని పాలించేది ప్రాంతీయ పార్టీల శక్తే అని అన్నారు. ద్రావిడ పార్టీలను మనం ఆదర్శంగా తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
జాతీయ రాజకీయాల ప్రస్థానాన్ని తాను కొనసాగిస్తానని.. ఎన్నికల తరువాత కూటమి కోసం ప్రయత్నం చేస్తామని కేసీఆర్ చెప్పారు. జాతీయ పార్టీలు తమకు మద్ధతు ఇవ్వక తప్పని పరిస్థితిని తీసుకువస్తామన్నారు. మహారాష్ట్రంలో పోటీ చేయాలని అక్కడి ప్రజలు తనను కోరుతున్నారని.. ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు కేసీఆర్. దేశంలో సన్‌ఫ్లవర్ గ్యాంగ్(అధికారం ఏ పార్టీదైతే ఆ పార్టీలో చేరేవారు) ఎక్కువైందని విమర్శించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారంతా వాళ్ల స్వార్థం కోసం వెళుతున్నారని కేసీఆర్ విమర్శించారు. లక్ష మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేరన్నారు.
గోబెల్స్ బతికి ఉంటే బీజేపీని చూసి చచ్చిపోయేవాడు..
గోబెల్స్ బతికి ఉంటే బీజేపీని చూసి చచ్చి పోతుండే అని కేసీఆర్ వ్యాఖ్యానించాడు. బీజేపీ మళ్లీ వస్తే పెట్రోల్, డీజిల్ ధర రూ. 400లకు పెరుగుతుందన్నారు. దళితులు, గిరిజనుల మాటనే బీజేపీ నోట రాదని విమర్శించారు. మోడీ దుర్మార్గ ప్రధాన మంత్రి అని.. మోడీవి అన్నీ జుటా మాటలు అని దుయ్యబట్టారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అన్ని జుటా మాటలని విమర్శించారు. మోడీ మాటలు అన్ని వట్టి గ్యాస్.. ట్రాష్ అన్నారు. మోడీ కాలంలో నిరుద్యోగం మాత్రం బాగా పెరిగిందని.. విద్వేషపు చర్యలు తప్ప దేశానికి ఆయన చేసింది ఏమి లేదన్నారు.
తెలంగాణకు ఎండపెట్టి గోదావరి నీళ్లను ఎవరికో ఇస్తాం అంటున్నారని.. ఈ కాంగ్రెస్ దద్దమ్మల పాలనలో నాగార్జున సాగర్ మీదకు మనం వెళ్లలేని పరిస్థితి వచ్చిందని తెలంగాణ ప్రజలనుద్దేశించి కేసీఆర్ అన్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు దాటవన్నారు. అందుకే మోడీ చొక్కాలు, కమీజ్ లు చింపుకుంటున్నారని విమర్శించారు. అదే సమయంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిందన్నారు. ప్రాంతీయ పార్టీల కూటమి దేశాన్ని పాలించే స్థాయికి ఎదుగుతుందన్నారు. బీజేపీకి ఈ రాష్ట్రంలో వన్ ఆర్ నన్ సీట్స్ వస్తాయని.. సౌత్ ఇండియాలో బీజేపీ కి పది సీట్లు కూడా రావన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తొమ్మిది స్థానాల్లో మూడో స్థానంలో ఉందన్నారు.
ఖర్గే హైదరాబాద్ రెండో రాజధాని కావాలని అనడం దుర్మార్గం అని కేసీఆర్ ఖండించారు. అలాంటి పిచ్చి వాళ్లకు ఇక్కడ స్థానం ఇవ్వొద్దంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. టంగ్ ట్విస్టింగ్ మోడీకి వచ్చినంతగా ఎవరికీ రాదన్నారు. బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా.. ముస్లిం రిజర్వేషన్లు తొలగించడం తప్పు అని ఖండించారు. 26 నుంచి 33 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ చెప్పారు.
పార్టీ పేరు మార్పుపై క్లారిటీ..
ఇదే సమయంలో బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్‌గా మారుస్తారా? అనే విషయంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్‌గానే ఉంటుందన్నారు. అవకాశం వస్తే తానూ పీఎం రేసులో ఉంటానని కేసీఆర్ స్పష్టం చేశారు. తమ పార్లమెంటరీ పార్టీ నేతగా కేఆర్ సురేష్ రెడ్డిని నియమిస్తామన్నారు. జిల్లాలలను తొలగిస్తాం అనే దెబ్బ కూడా కాంగ్రెస్ మీద పడుతుందన్నారు.
ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్..
ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ కేసుపైనా కేసీఆర్ స్పందించారు. రాష్ట్రంలో వంద మంది డీసీపీలు ఉన్నారని.. అందులో ఒక్కడు రాధా కిషన్ రావు అని.. అసలు ఎవరీ రాధాకిషన్ రావు అని వ్యాఖ్యానించారు కేసీఆర్. సీఎంకు ఫోన్ ట్యాపింగ్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. అంతేకాదు.. నిర్ణీత వ్యవధి తర్వాత ట్యాపింగ్ రికార్డ్స్ ధ్వంసం చేయొచ్చు అనే చట్టం కూడా ఉందన్నారు. ఇక లిక్కర్ స్కామ్ కేసు మోదీ సృష్టించిన రాజకీయ కుంభకోణం అని ఆరోపించారు కేసీఆర్. బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులను ఢిల్లీ బీజేపీ ఆఫీస్‌కు పంపించామని.. అప్పటి నుంచే తమపై కక్ష కట్టారని ఆరోపించారు కేసీఆర్. తన కూతురు కవితను కక్షతోనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్నారు. కానీ, కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందన్నారు.
For More Telangana News and Telugu News..
Updated Date - May 11 , 2024 | 05:07 PM