ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kaleshwaram: కాళేశ్వరం కమిషన్‌ గడువు మరో 2 నెలలు పెంపు

ABN, Publish Date - Nov 12 , 2024 | 03:48 AM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ గడువును మరో 2 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పొడిగింపు ఫైలుపై సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ గడువును మరో 2 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పొడిగింపు ఫైలుపై సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేశారు. మంగళవారం నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా జీవో జారీ చేసే అవకాశముంది. వాస్తవానికి ఈనెల 12 నుంచి జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ మూడో విడత క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది. అయితే పొడిగింపు జీవో వెలువడకపోవడంతో కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ షెడ్యూల్‌ విడుదల చేయలేదు..


ఇప్పటికే నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు, మాజీ ఈఎన్‌సీలతో పాటు చీఫ్‌ ఇంజనీర్లు, ఎస్‌ఈలకు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించిన కమిషన్‌.. ఇక నీటిపారుదల శాఖ కార్యదర్శులుగా, ఇతర హోదాల్లో పనిచేసిన ప్రస్తుత, మాజీ ఐఏఎ్‌సలను విచారించి బ్యారేజీల నిర్మాణంలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకున్నారన్న అంశంపై సాక్ష్యాలను సేకరించేందుకు సన్నద్ధమైంది. ఇద్దరు కీలక మాజీ ప్రతినిధులకు ఈ దఫా కమిషన్‌ కబురు పంపే అవకాశముంది. ఏదేమైనా డిసెంబరులో విచారణ ప్రక్రియలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని తెలుస్తోంది

Updated Date - Nov 12 , 2024 | 03:48 AM