ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Train Accident: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

ABN, Publish Date - Nov 13 , 2024 | 07:59 AM

పెద్దపల్లి జిల్లా: రాఘవాపూర్‌లో ఐరన్‌ కాయిల్స్ లోడుతో వెళుతున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుప్పి బోల్తా పడ్డాయి. పట్టాలపైనే 11 వ్యాగన్లు పడిపోయాయి. రాఘవపూర్ కన్నాల గేటు మధ్యలో గూడ్స్ రైలు అదుపు తప్పింది. ఈ ఘటనలో మూడు రైల్వే లైన్లు ధ్వంసమయ్యాయి.

పెద్దపల్లి జిల్లా: రాఘవాపూర్‌లో ఐరన్‌ కాయిల్స్ (Iron Coils) లోడుతో వెళుతున్న గూడ్స్‌ రైలు (Goods train) పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుప్పి బోల్తా పడ్డాయి. పట్టాలపైనే 11 వ్యాగన్లు పడిపోయాయి. రాఘవపూర్ కన్నాల గేటు మధ్యలో గూడ్స్ రైలు అదుపు తప్పింది. ఈ ఘటనలో మూడు రైల్వే లైన్లు ధ్వంసమయ్యాయి. పట్టాలు, కరెంటు పోల్స్ విరిగిపోయాయి. అప్రమత్తమైన అధికారులు రామగుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్‌లను నిలిపివేశారు. రైలు ఇంజన్ వైపు ఉన్న ఎనిమిది వ్యాగన్లను అధికారులు రామగుండంకు తరలించారు. గూడ్స్ రైలు నిజామాబాద్ నుంచి ఘజియాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పునరుద్ధరణకు 24 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.


ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా..

కాగా రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. మూడు రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్నాయని చెప్పారు. దీంతో పెద్దపల్లి.. రామగుండం వైపు వెళ్లే రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. తక్షణమే రైల్వే ట్రాక్‌ను పునరుద్దరించాలని అధికారులను బండి సంజయ్ కోరారు.


రైల్వే ట్రాక్‌ పునరుద్దరణ పనులు...

అధికారులు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. 24 గంటల సమయం పడుతుందని తెలిపారు. గూడ్స్‌ పట్టాలు తప్పిన విషయం తెలియడంతోనే రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం వల్ల ఈ మార్గంలో ఉన్న మూడు ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. ఖాజీపేట-బల్లార్షా మార్గంలో పలు రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. చెన్నై- ఢిల్లీ ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పెద్దపల్లి స్టేషన్‌లో సంపర్క్ క్రాంతి, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రమాదం మంగళవారం రాత్రి జరిగింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అసెంబ్లీలో మూడు సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్

స్నేహం నటించి.. చంపేస్తాడు

బాబు.. పవర్‌ఫుల్‌ సీఎం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 13 , 2024 | 07:59 AM