ఓసీపీ-3ని సందర్శించిన డైరెక్టర్(ఆపరేషన్స్)
ABN , Publish Date - Mar 21 , 2024 | 11:59 PM
ఆర్జీ-2 పరిధిలోని ఓసీపీ-3 ప్రాజెక్టు ను గురువారం డైరెక్టర్(ఆపరేషన్స్) ఎన్వీ శ్రీనివాస్ సందర్శించారు.
యైటింక్లయిన్‌కాలనీ, మార్చి 21: ఆర్జీ-2 పరిధిలోని ఓసీపీ-3 ప్రాజెక్టు ను గురువారం డైరెక్టర్(ఆపరేషన్స్) ఎన్వీ శ్రీనివాస్ సందర్శించారు. వ్యూ పాయింట్ నుండి ప్రాజెక్టు పని స్థలాలను పరిశీలించారు. బొగ్గు ఉత్పత్తి మెరుగుపడేలా చేపట్టాల్సిన పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. వార్షిక లక్ష్య సాధనకు మిగిలి ఉన్న 10రోజుల్లో ప్రణాళికాబద్ధం గా పనిచేయాలని సూచించారు. యంత్రాలను పూర్తిస్థాయిలో వినియో గించుకోవాలని, పని గంటలను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలి తాలు సాధించవచ్చని సూచించారు. వెంట జీఎం సూర్యనారాయణ, ప్రా జెక్టు అధికారి మధుసూదన్, మేనేజర్ రమేష్, ఎస్‌ఈ పవర సిస్టం నర్సిం హులు, సర్వేఅధికారి చంద్రమౌళి, ఎస్‌ఎస్‌వో షరీఫ్‌మహమ్మద్ ఉన్నారు.