ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్రీడలతో మానసికోల్లాసం..

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:45 AM

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్‌ అన్నారు.

కళ్యాణ్‌నగర్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్‌ అన్నారు. ఆదివారం గోదావరిఖని ఆర్‌సీఓఏ క్లబ్‌లో స్పోర్ట్స్‌ కరాటే హెడ్‌ కరాటే శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా 68వ స్కూల్‌ గేమ్స్‌ జోనల్‌ లెవల్‌ కరాటే టోర్నమెంట్‌ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు చిన్న నాటి నుంచే చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలతో జ్ఞానం పెరగడంతో పాటు శారీరధారుఢ్యం పెరుగుతుందని, పైచదువులకు వెళ్లేటప్పుడు క్రీడలు ఉపయోగపడుతాయన్నారు. చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లినప్పుడు క్రీడా సర్టిఫికెట్ల కోటాలో సీట్లు సాధిస్తున్నారని, అంతేకాకుండా ఉద్యోగాల్లో కూడా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు కూడా వస్తున్నాయని ఆయన చెప్పారు. గోదావరిఖనిలో కరాటే పోటీలు నిర్వహించడంపై నిర్వాహకులను అభినందించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్‌, సర్టిఫికెట్లను ఏసీపీ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సెక్యూరిటీ ఆఫీసర్‌ వీరారెడ్డి, తగరపు శంకర్‌, రాజిరెడ్డి, పసునూటి శంకర్‌, సురేష్‌, నాగరాజు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

నవంబర్‌లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు అండర్‌-14 బాలికల విభాగంలో మనస్విని, అద్విత, శ్రీవర్షిణి, సహస్ర, శృశిత, సహస్ర, శాన్వి, ముక్తశ్రీ, శ్రీనిధి, సహస్ర, సుల్తానా, అండర్‌-14 బాలుర విభాగంలో మణిదీప్‌, శ్రీరాజ్‌, సాయి, కుర్షిద్‌, చౌహాన్‌, విశ్వక్‌సేన్‌, రిశ్వంత్‌, అబ్దుల్‌ ముజీబ్‌, రిషికేష్‌, సూర్య ప్రభావ్‌ ఎంపికయ్యారు.

Updated Date - Oct 21 , 2024 | 12:45 AM