నిండుకుండలా మిడ్ మానేరు
ABN, Publish Date - Sep 16 , 2024 | 12:00 AM
శ్రీరాజరాజేశ్వర జలాశయం (మిడ్ మానేరు) నిండు కుండలా మారింది. మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు లేకపోవడంతో ఈ ఏడాది మిడ్ మానేరు పూర్తిస్థాయిలో నిండుతుందా? అనే సందేహం తలెత్తింది.
బోయినపల్లి, సెప్టెంబరు 14: శ్రీరాజరాజేశ్వర జలాశయం (మిడ్ మానేరు) నిండు కుండలా మారింది. మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు లేకపోవడంతో ఈ ఏడాది మిడ్ మానేరు పూర్తిస్థాయిలో నిండుతుందా? అనే సందేహం తలెత్తింది. అయితే ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ నుంచి వరద నీరు వచ్చి చేరడంతో జలకళను సంతరించుకుంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి శనివారం ఉదయం వరకు మిడ్ మానేరులోకి 48.859 టీఎంసీల వరద నీరు వచ్చి చేరగా ఇందులో శ్రీపాద ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా 23.978 టీఎంసీలు, ఎస్సారెస్పీ నుంచి 12.376, ప్రాజెక్టు ఎగువ భాగాన కురిసిన వర్షాలతో మానేరు, ములవాగు ద్వారా 12505 టీఎంసీల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. మిడ్ మానేరు నుంచి ఎల్‌ఎండీ ప్రాజెక్టుకు 10.127 టీఎంసీలు, ప్యాకేజీ 10లోని అన్నపూర్ణ రిజర్వాయర్‌కు 17.534 టీఎంసీలు కుడి కాలువకు 0.079 మిషన్ భగీరథక, నీటి ఆవిరి కింద 0.813 టీఎంసీలు తరలివెళ్లాయి. దీంతో మిడ్ మానేరుపై ఆధారపడిన ప్రాజెక్టులకు నీటి కష్టాలు తప్పడంతో ప్రాజెక్టుపై ఆధారపడిన పంట భూములకు వానాకాలం, యాసంగి సాగుకు డోకా లేకుండా పోయింది. మిడ్ మానేరు పూర్తి స్థాయి నీటి మట్టం 318. మీటర్లకు ప్రస్తుతం 317.47కు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 7.54 టీఎంసీలకు 26.19 టీఎంసీల మేరకు చేరుకొంది.
Updated Date - Sep 16 , 2024 | 12:00 AM