ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శరవేగంగా సమగ్ర సర్వే..

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:46 AM

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిల్లాలో వేగంగా జరుగుతున్నది. గడిచిన పదకొండు రోజుల్లో 85.09 శాతం సర్వే పూర్తికాగా, గ్రామీణ ప్రాంతాల్లో 89.36 శాతం, పట్టణ ప్రాంతాల్లో 77.29 శాతం సర్వే పూర్తయ్యింది.

ఎలిగేడు మండలంలో సర్వేను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష(ఫైల్‌)

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిల్లాలో వేగంగా జరుగుతున్నది. గడిచిన పదకొండు రోజుల్లో 85.09 శాతం సర్వే పూర్తికాగా, గ్రామీణ ప్రాంతాల్లో 89.36 శాతం, పట్టణ ప్రాంతాల్లో 77.29 శాతం సర్వే పూర్తయ్యింది. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతున్నది. గ్రామాల్లో కుటుంబాల గుర్తింపు కూడా త్వరగా పూర్తయ్యింది. పట్ణణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకుని ఉన్న వారితో పాటు అద్దె భవనాల్లో ఉంటున్న కుటుంబాలను గుర్తించడంలో అధికార యంత్రాంగం ఇబ్బందులకు గురయ్యింది. సర్వే కూడా పట్టణాల్లో ఇంటి యజమానులు అందుబాటులో లేక కాస్త జాప్యం అవుతున్నది. సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తుండడంతో జిల్లాలో వేగంగా జరుగుతున్నది. జిల్లాలో 2,54,828 కుటుంబాలను గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,64,363 కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో 90,465 కుటుంబాలున్నట్లు గుర్తించారు. మంగళవారం నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 1,46,887 కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో 89,921 కుటుంబాల సర్వే పూర్తి చేశారు. జిల్లాలో ఈ నెల 9వ తేదీన ప్రారంభించారు. 8 పేజీల్లో దాదాపు 72 అంశాల్లో ఈ సర్వే చేస్తున్నారు. కుల గణనతో పాటు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సర్వే చేస్తున్నారు. ఈ సర్వే ద్వారా ఆయా కుటుంబాల్లో ఉండే కుటుంబ సభ్యుల స్థితిగతులు అన్ని ఉన్నాయి. మతం, సామాజిక వర్దం, కులం పేరు చెప్పడం, ఆధార్‌ నంబర్లు ఇవ్వడం, సెల్‌ ఫోన్‌ నంబర్లు ఇవ్వడం ఐశ్చికమేనని, ఈ విషయంలో ఎవరిని ఇబ్బందులకు గురి చేయవద్దని ప్రభుత్వం సర్వే చేసే అధికారులు, సిబ్బందికి సూచించారు. అలాగే ఆస్తులు, భూముల వివరాలు చెప్పినవే రాసుకోవాలని సూచించారు. ఆ మేరకు సిబ్బంది సర్వేను జిల్లాలో వేగంగా నిర్వహిస్తున్నారు.

ఫ నాలుగైదు రోజుల్లో పూర్తి..

వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాలు, ఉపాధి పనుల దృష్ట్యా పట్టణ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో ఉంటున్న చాలా మంది తమ స్వగ్రామంలోనే సర్వేకు వెళుతున్నారు. అక్కడికి వెళ్లి వివరాలను వెల్లడిస్తున్నారు. దాదాపు 56 శాతం గ్రామాల్లో సర్వే పూర్తయ్యింది. ప్రభుత్వం సర్వే చేసేందుకు ఒక్కో ఎన్యూమరేటర్‌కు 15 రోజుల గడువు ఇచ్చింది. రోజుకు 10 కుటుంబాల సర్వే పూర్తి చేయాలని పేర్కొంది. మొదటి రెండు, మూడు రోజులు ఒక్కో కుటంబ సర్వే నిర్వహించేందుకు 30 నుంచి 45 నిమిషాల సమయం పట్టినప్పటికీ, ఆ తర్వాత సిబ్బందికి వివరాలు నమోదు చేయడం ఈజీ అయ్యింది. సర్వే చేసిన ఫారాలను ఎంపీడీఓ కార్యాలయాల్లో భద్రపరుస్తున్నారు. జిల్లాలో నిర్ధేశించిన గడువు 15 రోజుల్లోనే వందకు వంద శాతం సర్వే పూర్తయ్యే అవకాశాలున్నాయి. సర్వే సందర్భంగా ఎక్కడ కూడా జిల్లాలో నిరసనలు తెలిపిన సందర్భాలు కానరాలేదు. ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా సర్వే సాఫీగా సాగుతున్నదని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. సర్వే చేసిన వివరాలను కుటుంబాల వారీగా నమోదు చేసేందుకు తాత్కాలికంగా నియమించిన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇస్తున్న శిక్షణ మంగళవారం పూర్తయ్యింది. సర్వే పూర్తయిన వెంటనే ప్రభుత్వం రూపొందించిన సమగ్ర ఇంటింటి కుటుంబ యాప్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్లు నమోదు చేయనున్నారని అధికారులు తెలుపుతున్నారు. మొత్తంమీద జిల్లాలో నాలుగైదు రోజుల్లో సర్వే పూర్తి కానున్నది.

Updated Date - Nov 20 , 2024 | 12:46 AM