మహిళా సంఘాలకు ఊరట
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:47 AM
బ్యాంకుల నుంచి పొందిన రుణాలు వాయిదాల ప్రకారం సక్రమం గా చెల్లించిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల రాయితీని ప్రభుత్వం మంజూరు చేసింది. 2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి, మార్చి రెండు నెలల వీఎల్‌ఆర్ నిధులు విడుదల చేస్తూ సెర్ఫ్ సీఈవో దివ్వా దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి అ ధికారి కార్యాలయానికి లేఖ, ఈ మెయిల్ అందింది.
జగిత్యాల, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): బ్యాంకుల నుంచి పొందిన రుణాలు వాయిదాల ప్రకారం సక్రమం గా చెల్లించిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల రాయితీని ప్రభుత్వం మంజూరు చేసింది. 2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి, మార్చి రెండు నెలల వీఎల్‌ఆర్ నిధులు విడుదల చేస్తూ సెర్ఫ్ సీఈవో దివ్వా దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి అ ధికారి కార్యాలయానికి లేఖ, ఈ మెయిల్ అందింది. నే రుగా అర్హులైన సంఘాల ఖాతాల్లో ఈ నిధులు జమ చే స్తున్నట్లు..దీనిపై సంబంధిత గ్రామీణాభివృద్ధి శాఖ అధి కారులు మహిళా సంఘాలకు తెలియజేయాలని అందు లో పేర్కొన్నారు. వీటికోసం ఎదురు చూస్తున్న మహిళా సంఘాల సభ్యులు సర్కారు కానుకగా భావించి సంతో షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులను వడ్డీ లేని రుణా లకు అర్హత పొందిన సంఘాల సభ్యుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
జిల్లాలో వడ్డీ రాయితీ విడుదల ఇలా..
జిల్లా వ్యాప్తంగా 3,402 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ. 1.38 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో బీర్‌పూర్ మండలంలో 67 సంఘాలకు రూ. 3 లక్షలు, బుగ్గారంలో 49 సంఘాలకు రూ. 2 లక్షలు, ధర్మపురిలో 169 సంఘాలకు రూ. 6 ల క్షలు, గొల్లపల్లిలో 162 సంఘాలకు రూ. 6 లక్షలు, ఇబ్ర హీంపట్నంలో 111 సంఘాలకు రూ. 4 లక్షలు, జగిత్యాల రూరల్‌లో 228 సంఘాలకు రూ. 4 లక్షలు, జగిత్యాలలో 25 సంఘాలకు రూ. లక్ష విడుదల చేసింది. అదేవిదంగా కథలాపూర్‌లో 110 సంఘాలకు రూ. 5 లక్షలు, కొడిమ్యా లలో సంఘాలకు రూ. 13 లక్షలు, కోరుట్లలో 282 సం ఘాలకు రూ. 11 లక్షలు, మల్లాపూర్‌లో 468 సంఘాలకు రూ. 14 లక్షలు, మల్యాలలో 232 సంఘాలకు రూ. 11 ల క్షలు, మేడిపల్లిలో 139 సంఘాలకు రూ. 6 లక్షలు, మెట్ పల్లిలో 236 సంఘాలకు రూ.10 లక్షలు, పెగడపల్లిలో 266 సంఘాలకు రూ.12 లక్షలు, రాయికల్‌లో 144 సం ఘాలకు రూ.6 లక్షలు, సారంగపూర్‌లో 131 సంఘాలకు రూ.5 లక్షలు, వెల్గటూరులో 315 సంఘాలకు రూ. 14 లక్షలు వడ్డీ రాయితీని ప్రభుత్వం విడుదల చేసింది.
జిల్లాలో 14,694 సంఘాలు..
జిల్లాలోని ఆయా గ్రామాల్లో 14,694 స్వయం సహా యక మహిళా సంఘాలున్నాయి. ఆయా సంఘాలలో 11,73,412 మంది సభ్యులుగా ఉన్నారు. సంఘాల్లోని స భ్యులకు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసి, ఆదాయం వచ్చే ఆస్తులను కొనుగోలు చేసి, ఆర్థికాభి వృద్ధికి కృషి చేస్తారు. బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధితో పాటు వివిధ రకాల రుణాలను అందిస్తారు. సభ్యులు తీసుకు న్న రుణాలను సకాంలో వడ్డీతో సహా చెల్లించాల్సి ఉం టుంది. ఆ విధంగా చెల్లించిన సంఘాలకు ప్రభుత్వం తి రిగి వడ్డీని నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో మూడేళ్లుగా వడ్డీ విడుదల చేయ లేదు. దీంతో మహిళా సంఘాల సభ్యులు వడ్డీ కోసం ఎ దురుచూస్తున్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రె స్ ప్రభుత్వం వడ్డీ బకాయిలను వెంట వెంటనే విడుద ల చేస్తోంది.
మహిళా సంఘాలలో సభ్యులు తీసుకున్న రుణాలతో ఇతరులపై ఆధారపడ కుండా తాము ఆర్థికంగా ఎదగడంతో పాటు మరికొంత మందికి ఉపాధి కల్పిస్తు న్నారు. జిల్లాలో చాలా చోట్ల వివిధ రకాల రుణాలు తీసుకొని క్యాంటిన్, పెరటి కోళ్ల పెంపకం, గేదెల షెడ్డు(పాల ఉత్పత్తి)తో పాటు వరి ధాన్యం కొనుగోళ్లు, స్కూ ల్ యూనిఫాం కుట్టుట, రైతు సేవా కేంద్రాల నిర్వహణ, ఎంటర్‌ప్రైజెస్‌లు తద తర వాటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. సభ్యులకు రుణాలను అందించడమే కా కుండా వారు ఆదాయం వచ్చే యూనిట్లు ఏర్పాటు చేసేందుకు అవగాహన కల్పి స్తూ చర్యలు తీసుకుంటున్నారు.
పాత బకాయిల మాటేమిటి...?
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళా సం ఘాలకు వడ్డీ లేని రుణ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. అన్నట్లుగానే అధికారంలోకి రావడం తో గత యేడాది డిసెంబరు నుంచి బకాయిలను మహిళా సంఘాల సభ్యులకు చెల్లిస్తోంది. ఇలా ఇప్పటి వరకు నాలుగు నెలల బకాయిలను చెల్లించినప్పటికీ అంతకు ముందు బకాయిలపై ప్రకటన చేయకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 2019-20 సంవత్సరం నుంచి వేలాది సంఘా లకు వడ్డీ బకాయిలు పేరుకుపోవడంతో వాటిని విడుదల చేస్తుందా... లేదా..అనే అయోమయం సంఘాల్లో నెలకొంది. అంతేకాక ఈ యేడాది ఏప్రిల్ నుంచి అక్టోబ ర్ వరకు బకాయిలు కూడా అందాల్సి ఉంది.
సద్వినియోగం చేసుకోవాలి
రఘువరన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
మహిళా సంఘాల సభ్యులు సంఘం ద్వారా తీసుకున్న రుణా లు ఆదాయం వచ్చే మార్గాన్ని ఎంచుకొని రుణాలను సద్విని యో గం చేసుకోవాలి. ప్రభుత్వం విడుదల చేసిన వడ్డీ నిధులు నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ అవుతాయి. తీసుకున్న రుణాలను వా యిదాల ప్రకారం చెల్లించి, తిరిగి రుణం పొందవచ్చు. ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ అందించడం జరుగుతోంది.