డిప్యూటేషన్లలో సీనియర్ కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వాలి
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:44 AM
సింగరేణిలో సంవత్సరాల తరబడి పని చేస్తున్న సీనియర్ కార్మికులకు సర్ఫేసులలో డిప్యూటేషన్‌పై అవకాశాలు ఇవ్వకుండా జూనియర్ కార్మికులకు ఇవ్వడం సరికాదని సింగరే ణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు.
గోదావరిఖని, అక్టోబరు 20 : సింగరేణిలో సంవత్సరాల తరబడి పని చేస్తున్న సీనియర్ కార్మికులకు సర్ఫేసులలో డిప్యూటేషన్‌పై అవకాశాలు ఇవ్వకుండా జూనియర్ కార్మికులకు ఇవ్వడం సరికాదని సింగరే ణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. ఆదివారం స్థానిక చౌరస్తా సమీపంలోని హెచ్‌ఎం ఎస్ కార్యాలయంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశం నిర్వహించింది. ఈ సమావే శంలో హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు జీ రాములు పాల్గొని మాట్లాడారు. సీనియర్ కార్మికులను కంపెనీ అధికారులు గుర్తించి వారికి న్యాయంగా డిప్యూటేషన్ అవకాశాలు కల్పించాలని యాజమాన్యానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశామని, కొంత మంది దళారీలచే లక్షల రూపాయలు చేతులు మారి డిప్యూటేషన్ల దందాను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. సింగరేణి ఉన్నత అధికారులు దీనిపై దృష్టి సారించాలని, పారదర్శకత పాటించి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్నారు. సింగరేణిలో 30-40 సంవత్సరాల క్రితం పనిచేసిన కార్మికులు మారు పేర్లు కలిగి ఉన్నారని, వారి వారసులకు ఉద్యోగాలు కల్పించడంలో సింగరే ణి యజమాన్యం అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తుందని, గతంలో గుర్తింపు సంఘంగా ఉన్న టీబీ జీకేఎస్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా మారు పేర్లను సరి చేస్తామని సింగరేణి కార్మికులకు హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదన్నారు. రిటైర్డ్ అయిన కార్మికుల కుటుంబాలు తమ వారసుల ఉద్యోగాల విషయములో విజిలెన్స్ విచారణల పేరిట అనేక కేసులు పెండింగ్‌లో ఉండడం వల్ల ఎదురు చూస్తున్నారని, వీటన్నీం టిపై సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మారుపేర్లను సరిచేసి వారి కుటుంబాలకు ఉద్యోగాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కార్యక్రమా లు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు జక్కుల నారాయణ, నరేష్, ఎం కొమురయ్య, పీ శేఖర్, జీ మల్లేశం, ఈ రాజేందర్, పెగడపల్లి రాజనర్సు పాల్గొన్నారు.
Updated Date - Oct 21 , 2024 | 12:44 AM