ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు

ABN, Publish Date - Nov 07 , 2024 | 03:12 AM

సీఎం రేవంత్‌రెడ్డి, మేఘా అధినేత కృష్ణారెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి.. ఈ ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

  • కాంట్రాక్టులు అన్నీంటినీ ఆ 2 సంస్థలకే కట్టబెడతారా?

  • ‘కొడంగల్‌’లో సీఎం రేవంత్‌ వాటా ఎంత? ఢిల్లీ వాటా ఎంత?

  • సీఎం చెప్పినట్లే చేస్తే అధికారుల ఉద్యోగాలు ఊడుతాయ్‌: కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంత్‌రెడ్డి, మేఘా అధినేత కృష్ణారెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి.. ఈ ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఆంధ్రా కంపెనీ, ఈస్ట్‌ ఇండియా అరాచక కంపెనీ అని గతంలో విమర్శించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అదే మేఘా కంపెనీకి పలు కాంట్రాక్టులు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. దొంగలు, దొంగలు కలసి ఊళ్లు పంచుకున్నట్లు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటినీ పొంగులేటికి చెందిన సంస్థ, మేఘా సంస్థకు కట్టబెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులు, ఇంజనీర్లు రేవంత్‌రెడ్డి చెప్పినట్లు సంతకం పెడితే మేము అధికారంలోకి వచ్చాక విచారణ ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్‌ ఉద్యోగం ఊడిపోతుందని, ఆ తర్వాత అధికారుల ఉద్యోగాలూ ఊడుతాయని వ్యాఖ్యానించారు.


మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్‌ ఆగమాగం అవుతున్నారని, ఇప్పటికిప్పుడు కాంట్రాక్టులు అప్పజెప్పి.. అక్రమంగా డబ్బులు రాబట్టాలని చూస్తున్నారన్నారు. కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి వెచ్చించనున్న రూ.4,350కోట్లలో రేవంత్‌ వాటా ఎంత? ఢిల్లీ వాటా ఎంత? అని నిలదీశారు. అమృత్‌ టెండర్లను సీఎం తన బావమరిదికి ఇచ్చిన విషయంలో కేంద్ర సంస్థలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి పని చేస్తున్నాయని, వాటి బాగోతాలను ఒక్కొక్కటిగా బయటపెడతానని అన్నారు. ‘‘వాళ్లు, వీళ్లు జైలుకుపోతారని చెప్పడానికి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఎవరు? ఆయనేమైనా హోంమంత్రా..? పోలీస్‌ ఉన్నతాధికారా..? బాంబులు పేల్చడం కాదు.. ముందు ఆయనే జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండాలి.


ఎవ్వరు, ఎప్పుడు అరెస్ట్‌ అవుతారో మంత్రి చెబుతారా? వీళ్లు ప్రభుత్వం నడుపుతున్నారా..? సర్కస్‌ నడుపుతున్నారా?’’ అని ఎద్దేవా చేశారు. కాగా, ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు.. పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడాలని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రైతన్నల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయాలని సూచించారు. కాగా, ఈనెల 9న జరిగే మలేషియా తెలంగాణ అసోసియేషన్‌ దశాబ్ది ఉత్సవాలకు కేటీఆర్‌ హాజరుకానున్నారు. ఈ ఉత్సవాల పోస్టర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు.

Updated Date - Nov 07 , 2024 | 03:12 AM