Share News

అంధుల అక్షర ప్రదాత లూయిస్‌ బ్రెయిలీ

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:14 AM

అంధుల అక్షర ప్రదాత లూయిస్‌ బ్రెయిలీ అని డ్వాబ్‌ ప్రధాన కార్యదర్శి, ఏఐసీబీ ఉపాధ్యక్షుడు పొ నుగోటి చొక్కారావు అన్నారు.

 అంధుల అక్షర ప్రదాత లూయిస్‌ బ్రెయిలీ
బ్రెయిలీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న పొనుగోటి చొక్కారావు

అంధుల అక్షర ప్రదాత లూయిస్‌ బ్రెయిలీ

డ్వాబ్‌ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు

నల్లగొండ, జనవరి 4: అంధుల అక్షర ప్రదాత లూయిస్‌ బ్రెయిలీ అని డ్వాబ్‌ ప్రధాన కార్యదర్శి, ఏఐసీబీ ఉపాధ్యక్షుడు పొ నుగోటి చొక్కారావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సూ రదాస్‌ భవనలో లూయిస్‌ బ్రెయిలీ 215వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లూయిస్‌ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ రిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లూయిస్‌ బ్రెయిలీ భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి అంధ సమాజం కోసం ముందుచూపుతో ఆలోచించారని కొనియాడారు. ఇది ఆయన ని బద్ధతకు నిదర్శనమని, స్ఫూర్తిదాయకమన్నారు. పదో తరగతి పి ల్లల పరీక్షలకు భాషలో మినహాయింపు వద్దని, అంధులకు వైనషాపుల్లో రిజర్వేషనను కోర్టు ద్వారా పరిష్కరించడం జరిగిందన్నారు. అదేవిధంగా టోల్‌గేట్‌ చెల్లింపుల నుంచి మినహాయింపు కోసం సర్క్యులర్‌ జారీ చేయించినట్లు తెలిపారు. అంధులకు అ న్ని రకాల బస్సుల్లో 50 శాతం మినహాయింపు ఇవ్వాలని కోరా రు. అంధులు ఖచ్చితంగా టికెట్‌ తీసుకుని ప్రయాణించాలని, ఉ చితాన్ని ప్రోత్సహించవద్దని ఆయన సూచించారు. అంధుల స మస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయనపల్లి జగన్మోహనరావు, పెండ్యాల దామోదర్‌రావు, నాగులవంచ వెంకటేశ్వర్‌రావు, సతీష్‌, సైదులు, మహే ష్‌ తదితరులు పాల్గొన్నారు.

లూయిస్‌ బ్రెయిలీ జీవితం భవిష్యత్తు తరాలకు ఆదర్శ ప్రాయమని జిల్లా సంక్షేమశాఖ అధికారి కెవి.కృష్ణవేణి, గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి కాళిందిని అన్నారు. గురువారం జిల్లా సం క్షేమ కార్యాలయంలో బ్రెయిలీ జయంతి వేడుకలు నిర్వహించా రు. కార్యక్రమంలో క్రాంతికుమార్‌, సైదులు, శ్రీహరి, వెంకట్‌రెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ అంధ ఉద్యోగి బాలయ్యను ఘనంగా సన్మానించారు.

Updated Date - Jan 05 , 2024 | 12:14 AM