Share News

ఆదర్శ ప్రజా సేవకుడు మన్మోహన్‌సింగ్‌

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:30 PM

అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వ హించిన డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ప్రజానాయకు డని వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రమోహన్‌ తెలి పారు.

ఆదర్శ ప్రజా సేవకుడు మన్మోహన్‌సింగ్‌
మన్మోహన్‌సింగ్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు

వైస్‌ ప్రిన్సిపాల్‌ చంద్రమోహన్‌

గద్వాల టౌన్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వ హించిన డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ప్రజానాయకు డని వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రమోహన్‌ తెలి పారు. మన్మోహన్‌సింగ్‌ మృతికి సంతాప సూచి కంగా శనివారం స్థానిక మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక స్థితిగతులను తన సంస్కరణల ద్వారా పరిష్కరించిన మన్మోహన్‌సింగ్‌ దేశ ఆర్థిక పురో గతికి రాచబాటలు వేశారని విద్యార్థులకు వివరించారు.

Updated Date - Dec 28 , 2024 | 11:31 PM