ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మట్టి దందా.. ఏపీ టు తెలంగాణ

ABN, Publish Date - Oct 20 , 2024 | 11:02 PM

ఏపీ ఇసుక మాఫియా మొన్నటిదాక తుంగభద్ర నదిలో మన బార్డర్‌లోకి వచ్చి మరీ ఇసుక దోచుకెళ్లారు. ఇప్పుడేమో ఏపీ మట్టిమాఫియా ఎల్లలు దాటి తెలంగాణలోకి చొరబడి రవాణ చేస్తున్నారు.

అలంపూర్‌ చౌరస్తా సమీపంలో ఓ వెంచర్‌లో అక్రమంగా మట్టిరవాణ

తెలంగాణ మైనింగ్‌కు భారీ నష్టం

మూణ్నెళ్లలో వేలాది టిప్పర్ల మట్టి రవాణ

చోద్యం చూస్తున్న స్థానిక అధికారులు

వెంచర్లకు రవాణ చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఏపీ మట్టి మాఫియా

అలంపూర్‌చౌరస్తా, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ఏపీ ఇసుక మాఫియా మొన్నటిదాక తుంగభద్ర నదిలో మన బార్డర్‌లోకి వచ్చి మరీ ఇసుక దోచుకెళ్లారు. ఇప్పుడేమో ఏపీ మట్టిమాఫియా ఎల్లలు దాటి తెలంగాణలోకి చొరబడి రవాణ చేస్తున్నారు. దీని వల్ల తెలంగాణ ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది. గత మూణ్నేళ్లలో సుమారు భారీ ఎత్తున తెలంగాణలోకి మట్టి తరలించి సొమ్ము చేసుకున్నారు. తాజాగా ఏపీకి చెందిన ఓ మట్టిమాఫియా లీడర్‌ తెలంగాణ బార్డర్‌లో అధికారులతో ములాఖత్‌ జరిపి గత వారంరోజులుగా అలంపూర్‌ చౌరస్తాలోని ఓ వెంచర్‌లోకి తరలిస్తున్నాడు. రోజు రాత్రి సమయాల్లో పదుల సంఖ్యలో టిప్పర్ల సాయంతో అక్రమంగా ఏపీలోని ఉలిందకొండ సమీప ప్రాంతాల నుంచి మట్టిని తీసుకొస్తున్నారు. ఇదంతా తెలిసిన స్థానిక అధికారులు పట్టించుకోకపోవడం వెనక పలు అనుమానాలకు తావిస్తున్నది. ఏపీ మట్టి మాఫియాకు స్థానిక అధికారులు కొంతమంది సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలంపూర్‌ సమీపం నుంచి మట్టి తరలించాలంటే తెలంగాణ మైనింగ్‌ శాఖ నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. ఇందుకు చలానా రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుందని కొందరు రియల్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండా దొంగచాటున రాత్రి సమయాల్లో ఏపీ నుంచి ఎర్రమట్టి దిగుమతి చేసుకుంటున్నారు. వాస్తవానికి ఏపీకి చెందిన కమర్శియల్‌ వాహనాలు తెలంగాణలో తిరగాలంటే అర్‌టీఐ శాఖ నుండి రోడ్డు అనుమతులు పొందాలి కానీ అవేవి లేకుండానే వందలాది టిప్పర్లు వచ్చి వెళ్తున్న స్థానిక ఆర్‌టీఐ శాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. పరోక్షంగా తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ విషయంపై ఉండవల్లి ఎస్సై మహేష్‌ మాట్లాడుతూ.. నాలుగురోజుల క్రితం రాత్రి సమయాల్లో ఏపీ నుంచి మన ప్రాంతంలోకి ఎర్రమట్టి రవాణ చేస్తున్నారన్న సమాచారం రావాడంతో సదరు వ్యాపారులకు గట్టిగా హెచ్చరించాం. ఒకవేళ మళ్లీ రవాణ జరుగుతుంటే మాత్రం చర్యలు తీసుకుంటాం.

Updated Date - Oct 20 , 2024 | 11:02 PM