ఆగమవుతున్న అన్నదాతలు
ABN, Publish Date - Oct 20 , 2024 | 11:50 PM
అకాల వర్షాలకు అన్నదాతలు ఆగమవుతున్నారు.
- కొల్లాపూర్ మండలంలో 120 ఎకరాల వరి, 69ఎకరాల మినుము పంట నష్టం
కొల్లాపూర్/కోడేరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : అకాల వర్షాలకు అన్నదాతలు ఆగమవుతున్నారు. నాగ ర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో వరి, మిను ము సాగుచేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారం రోజుల నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలతో కొల్లాపూర్ మండలంలో 120ఎకరాల వరి, 69 ఎకరాల్లో మినుము పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయాధి కారులు తెలిపారు. కొల్లాపూర్ మండలంలోని రామాపు రం గ్రామంలో ఆకునమోని వెంకటయ్య రెండున్నర ఎకరాల్లో వేసిన వరి పంట శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం కురిసిన వర్షానికి నేలకొరిగింది. పంట చేతికి వసస్తుందనుకున్న దశలో వర్షాలు కురవడం వల్లన తమకు తీరని నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని మొలచింతలపల్లిలో నేలకొరిగిన పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి జిల్లా ఉన్నతాధికారులకు నివేదికను పంపుతున్న ట్లు మండల వ్యవసాయ అధికారి చిన్నహస్సేన్‌యాదవ్ తెలిపారు. అదేవిధంగా కోడేరు మండల కేంద్రంతో పాటు, పస్పుల, బావాయిపల్లి, తీగలపల్లి, జనుంపల్లి, నాగులపల్లి, ముత్తిరెడ్డిపల్లి, ఎత్తం, రాజాపూర్, నర్సాయి పల్లి తదితర గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది. నేలకొరిగిన వరి పంటపైకి ఎత్తి కొన్ని కొన్ని కలిపి కట్టే ప్రయత్నం రైతులు చేస్తున్నారు. వ్యవసాయ అధికా రులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన వరి, మిను ములు, వేరుశనగ పంటలను పరిశీలించి నష్టపరి హారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - Oct 20 , 2024 | 11:50 PM