ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కలెక్టర్‌ వద్దకు కుర్చీ పంచాయితీ

ABN, Publish Date - Aug 14 , 2024 | 11:35 PM

ఇంటర్‌ విద్యాశాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులతో ఒకరు.. హైకోర్టు ఉత్తర్వులతో ఇంకొకరు డీఐఈవో పోస్టులో కొనసాగడంపై బుధవారం ’ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ మనుచౌదరి స్పందించారు. ‘నేనంటే నేను’ శీర్షికన ప్రచురితమైన ఈ కథనం జిల్లా విద్యాశాఖలో చర్చనీయాంశమైంది

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఆగస్టు 14: ఇంటర్‌ విద్యాశాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులతో ఒకరు.. హైకోర్టు ఉత్తర్వులతో ఇంకొకరు డీఐఈవో పోస్టులో కొనసాగడంపై బుధవారం ’ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ మనుచౌదరి స్పందించారు. ‘నేనంటే నేను’ శీర్షికన ప్రచురితమైన ఈ కథనం జిల్లా విద్యాశాఖలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కలెక్టర్‌ బుధవారం ఉదయాన్నే ఇద్దరు అధికారులను పిలిపించారు. కోహెడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్న రవీందర్‌రెడ్డిని సిద్దిపేట జిల్లా ఇంటర్‌ విద్యాధికారిగా నియమిస్తూ ఆ విభాగం రాష్ట్ర డైరెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వులను కలెక్టర్‌ పరిశీలించారు. అదే విధంగా జూలై 1 నుంచి జిల్లా ఇంటర్‌ విద్యాధికారిగా కొనసాగుతున్న హిమబిందుకు తాజాగా హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సైతం పరిశీలించారు. హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు యథాస్థితి ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో హిమబిందునే కొనసాగించాలని అన్నట్లుగా తెలిసింది. దీంతో ఆమె బుధవారం తన కార్యాలయానికి వెళ్లి విధులు నిర్వహించారు. దీనిపై రవీందర్‌రెడ్డి సైతం ఇంటర్‌ విద్యాశాఖ ఉన్నతాఽధికారులను కలిసి విషయాన్ని వివరించినట్లు సమాచారం. కోర్టు నుంచి తుది తీర్పు వెలువడితేనే ఈ సస్పెన్స్‌కు ముగింపు పలికినట్లవుతుంది.

Updated Date - Aug 14 , 2024 | 11:35 PM

Advertising
Advertising
<