ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొర్రీలు లేకుండా రుణమాఫీని అమలు చేయాలి

ABN, Publish Date - Aug 09 , 2024 | 11:26 PM

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి

కార్యక్రమంలో మాట్లాడుతున్న మనోహర్‌రెడ్డి

గజ్వేల్‌, ఆగస్టు 9: కొర్రీలు లేకుండా రుణమాఫీని అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ‘అన్నదాతల ఆవేదనపై రైతు రచ్చబండ’ అనే కార్యక్రమాన్ని గజ్వేల్‌ పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తాలో శుక్రవారం బీజేపీ కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించి సంతకాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతీ రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ మాట ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సవాలక్ష కొర్రీలతో రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రైతు డిక్లరేషన్‌ పేరిట అనేక వాగ్ధానాలు చేసి రైతులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చిందన్నారు. రచ్చబండ కార్యక్రమానికి రైతులు భారీగా వచ్చి తమ గోడును వెల్లబోసుకున్నారని, ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసి రైతుబంధును అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయనవెంట బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ధరం గురువారెడ్డి, వెంకటరమణ, కిసాన్‌మోర్చా నాయకులు వెంకట్‌రాంరెడ్డి, మర్కంటి ఏగొండ, జిల్లా ప్రధాన కార్యదర్శి విభీషణ్‌రెడ్డి, యెల్లు రాంరెడ్డి, బీజేపీ పట్టణాధ్యక్షుడు మనోహర్‌యాదవ్‌, అసెంబ్లీ కన్వీనర్లు ఎల్కంటి సురేశ్‌, బండారి మహేశ్‌, కోదండం శ్రీనివా్‌సరెడ్డి, శివకుమార్‌, రాములు, నాయిని సందీప్‌, బారు అరవింద్‌, కుంకుమరాణి, ఉమ ఉన్నారు.

Updated Date - Aug 09 , 2024 | 11:26 PM

Advertising
Advertising
<