ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

ABN, Publish Date - Aug 13 , 2024 | 11:42 PM

టేక్మాల్‌, ఆగస్టు 13: ఆత్మహత్య చేసుకున్న ఇంటర్‌ విద్యార్థి మృతదేహాన్ని 12 రోజుల తర్వాత వెలికి తీసి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు.

గతనెల 31న ఘటన.. మరుసటి రోజు ఖననం

యువకుడి వేధింపుల వల్లేనని ఫిర్యాదు

13 రోజుల తర్వాత పోస్టుమార్టం

టేక్మాల్‌, ఆగస్టు 13: ఆత్మహత్య చేసుకున్న ఇంటర్‌ విద్యార్థి మృతదేహాన్ని 12 రోజుల తర్వాత వెలికి తీసి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. అయితే, విద్యార్థిని గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరిట వేధించడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందన్న ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం పూడ్చి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం చేయించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం తంపులూరు గ్రామానికి చెందిన గొస్కె సుప్రజ(16) హవేళిఘనపురంలో ఉంటూ ఇంటర్‌ చదువుతోంది. గతనెల 30న ఇంటికి వచ్చింది. మరుసటి రోజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుంది. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకుండానే కుటుంబసభ్యులు ఈనెల 1న తమ సొంత పొలంలోనే ఖననం చేశారు. అయితే, గ్రామానికి చెందిన ఓ యువకుడు తన కోడలిని ప్రేమపేరుతో మానసికంగా, శారీరకంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని అనుమానిస్తూ బాలిక మామయ్య గోస్కె సాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక మృతదేహాన్ని వెలికితీసి సంగారెడ్డికి చెందిన ఫోరెన్సిక్‌ వైద్యులు డాక్టర్‌ పి. వాణిశ్రీ, డాక్టర్‌ చంద్రదీక్‌ల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. టేక్మాల్‌ తహసీల్దార్‌ కృష్ణ, అల్లాదుర్గం సీఐ రేణుక, టేక్మాల్‌ ఏఎ్‌సఐ తుక్కయ్యలు పోస్టుమార్టంను పర్యవేక్షించారు.

Updated Date - Aug 13 , 2024 | 11:42 PM

Advertising
Advertising
<